కల్లుకు, నీరాకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరంలో నీరా కేఫ్ ను ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాలు శ్రమించి రూ.20 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ కేఫ్ తెరిచివుంటుంది. కేఫ్ చుట్టూ తాటిచెట్లతో అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. నీరాతోపాటు హనీ, ఐస్ క్రీమ్, నీరా బూస్ట్, షుగరు అందుబాటులో ఉన్నాయి. చికెన్, మటన్ ఐటమ్స్ కోసం కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు.

నీరా, కల్లు ఒకటి కాదు. నీరాలో ఆల్కహాల్ ఉండదు. కల్లులో ఉంటుంది. కొబ్బరి, ఖర్జూరం, జీలుగు, తాడి, ఈత చెట్లు స్రవించే సిద్ధమైన ద్రవం నీరా. వాటిల్లో సహజంగా ఉండే చక్కెరలు అలాగే ఉంటే దాన్ని నీరా అంటారు. అందులో ఉన్న చక్కెర ఆల్కహాల్ గా మారితే అది కల్లు అవుతుంది. నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. ఎండ వచ్చిన తర్వాత, ఉష్ణోగ్రతలు పెరిగితే అది పులిసిపోయి కల్లుగా మారుతుంది. అందులో ఆల్కహాల్ ఉంటుంది.

neera-

కల్లు తయాలనుకుంటే కుండ లోపల ఈస్ట్ కలుపుతారు. నీరా పడిన తర్వాత ఈస్ట్ దాన్ని కల్లుగా మారుస్తుంది. ఎండ పెరిగేకొద్దీ ఇది పుల్లగా మారుతుంది. మత్తు వస్తుంది కాబట్టి కల్లును తొందరగా ఎవరూ తీసుకోరు. అయితే నీరా మాత్రం అందరూ, అన్నివయసులవారు తాగొచ్చు. కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఎముకల పటుత్వం పెంచడంతో వృద్ధుల్లో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కామెర్లు, టైఫాయిడ్, విరేచనాలు, వాంతులవంటి వ్యాధులను దగ్గరకు రానివ్వడు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, గ్యాస్, మలబద్దకం, అజీర్తి లాంటివన్నీ తగ్గిపోతాయి. కంటిచూపు పెరుగుతుంది. కాలేయ పనితీరు మెరుగవుతుంది. షుగరు ఉన్నవారు కూడా నీరాను తాగొచ్చు. శ్వాస సమస్యలను తగ్గించడంతోపాటు షుగరును నియంత్రణలో ఉంచుతుంది. నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+