టమాటా అనేది పండా? కూరగాయా?
వంటగదిలో ఉండే కూరగాయల్లో టమాటాది ప్రత్యేక స్థానం. ఏ కూరగాయాలు అందుబాటులో ఉన్నా లేకపోయినా టమాటాను మాత్రం అందుబాటులో ఉంచుకుంటారు. ఏదో ఒక కూరను వేగంగా వండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి వంట వచ్చినవారంతా టమాటాకు అంత ప్రాధాన్యం ఇస్తారు. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ప్రతిరోజు టమాటాను తినడంవల్ల యవ్వనంగా ఉంచుతుంది. ఇప్పటికీ చాలామందికి టామాటా అనేది కూరగాయా? లేదంటే పండా? అనే సందేహం ఉంది.
కడుపులో బ్యాక్టీరియాలపై దాడి చేసే రక్షణ కవచంగా టమాటా పని చేస్తుంది. ఈ విషయాన్ని భారతీయులు ఏనాడో గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9,000 రకాల టమోటాలున్నాయి. వీటిసాగు ఏ దేశంలోనైనా తిరుగులేనిదిగా, లాభాలనార్జించేదిగా నిలుస్తుంది. విదేశాల్లో సలాడ్ సిద్ధం కావాలంటే టమాటా ఉండాల్సిందే.
పెరూలో మొదటిసారిగా టమాటా సాగు మొదలైంది. అక్కడి నుంచి స్పయిన్, మెక్సికో ద్వారా ప్రపంచమంతటా విస్తరించింది.

అమెరికాలో దీన్ని లవ్ యాపిల్ అని పిలుస్తారు. 16వ శతాబ్దంలో ఇది మనదేశానికి వచ్చింది. పోర్చుగీస్, స్పానిష్ నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నారు. మొదట్లో టమాటాలను ఫారిన్ వంకాయలుగా గుర్తించేవారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో టమాటాని పండు అని పేర్కొన్నారు. కానీ ఇవి క్యూబ్డ్ కంటే ఎక్కువ ఉపయోగకరమని చెప్పడంతో దీన్ని కూరగాయగా పరిగణిస్తున్నారు. వంటల్లో పుల్లటి రుచి కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారతీయ వంటల్లో నిమ్మకాయ, చింతపండు తర్వాత టమాటాను ఎక్కువగా వాడుతుంటారు.












Click it and Unblock the Notifications