టమాటా మసాలా కర్రీ.. నాన్ వెజ్ కన్నా సూపర్ గా.. ఇలా ట్రై చెయ్యండి!

సాధారణంగా ఇంట్లో టమాటాలు ఉంటే, రకరకాల కూరగాయలతో కలిపి టమాటాలను వండుతూ ఉంటాం. కానీ టమాటాలతో మసాలా కర్రీ చేస్తే అది అన్నంలో తినడానికి సూపర్ గా ఉంటుంది. రోటి, చపాతి, బిర్యానీ, పులావ్ ఏదైనా సరే టమాటా మసాలా కర్రీ మంచి కాంబినేషన్ అవుతుంది. మరి టమాటా మసాలా కర్రీ ఎలా తయారుచేస్తారు? కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.

టమాటా మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
టమాటాలు- ఆరు లేదా ఏడు
పచ్చిమిరపకాయలు ఆరు
ఉల్లిపాయలు రెండు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
పల్లీలు- రెండు టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి ముక్కలు- ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టేబుల్ స్పూన్
గరం మసాల- ఒక టేబుల్ స్పూన్
పసుపు- అర స్పూన్
ఉప్పు- రెండు టేబుల్ స్పూన్లు( రుచికి తగినంత)
కారం- రెండు టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి- ఒక టేబుల్ స్పూన్
చింతపండు రసం- చిన్న నిమ్మకాయంత చింతపండు నుండి తీసింది.

tomato masala curry make and eat this special curry with roti rice and biryani too

తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను ముక్కలుగా కట్ చేయకుండా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి.

ఇలా చేస్తే టమాటా మసాలా కర్రీ
టమాటాలు మగ్గుతున్నప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. వేరొక స్టవ్ మీద పల్లీలను, కట్ చేసి పెట్టుకున్న ఎండుకొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇక వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ లా చేసుకోవాలి. మగ్గిన టమాటా లలో ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే గరం మసాల యాడ్ చేయాలి.

అన్నిటిలోనూ తినటానికి సూపర్ కర్రీ
ఆపై అందులో నానబెట్టుకున్న నిమ్మకాయంత చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలి. నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. అందులో ధనియాల పొడిని యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే వేడి వేడి టమాటా మసాలా కర్రీ రెడీ అయిన అవుతుంది. ఇది అన్నంలో కే కాదు బిర్యానీలో కైనా, పలావ్ లో కైనా, రోటి లలోకి అయినా కూడా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+