టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!

టమాటోలు అనగానే చాలామందికి నోరూరుతుంది. టమాటో కర్రీ, టమాటో చారు, టమాటో పచ్చడి ఇలా ఏది చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో టమాటోలను తినేందుకు ఫుడ్ లవర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా టమాటో నువ్వుల పచ్చడిని ఇలా తయారు చేస్తే ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. మరి ఈ నయా స్టైల్ టమాటో నువ్వుల పచ్చడి తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు..?

టమాటో నువ్వుల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. టమాటోలు బాగా పండినవి, ధనియాలు, మెంతులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, నూనె తగినంత తీసుకోవాలి. టమాటో నువ్వుల పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో మెంతులు, జీలకర్ర, ధనియాలతో పాటుగా నువ్వులు వేయాలి. బాగా వేయించి చల్లార్చుకోవాలి.

చల్లారిన మెంతులు, ధనియాలు, నువ్వులు, జీలకర్రను మిక్సీ జార్ లో వేయాలి. మెత్తగా పొడి మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే టమాటో ముక్కలు వేయాలి. బాగా దగ్గరకు వచ్చేంతవరకూ వేయించుకోవాలి. టమాటోలు దగ్గరికి అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

Tomato Sesame Chutney Recipe Full Ingredients and Quick Preparation Method home made style recipe

ఇప్పుడు ఈ మిశ్రమంలోనే వెల్లుల్లి తరుగుతోపాటుగా రుచికి సరిపడా ఉప్పు వేయాలి. పేస్ట్ లాగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక తాళింపు కోసం మరో గిన్నె పెట్టుకుని తాళింపు చేసుకోండి. ఈ తాళింపును ముందుగా చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోండి.. అంతే సూపర్ టేస్టీ టమాటో నువ్వుల పచ్చడి రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+