ఈ మూడు ఆహారాలతో ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్..!
ప్రస్తుతం ఫ్యాటీ లివర్ సమస్య అధికం అవుతోంది. బీపీ, షుగర్, మాదిరిగానే ఇప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య కూడా సాధారణంగా మారిపోయింది. మారిన జీవనశైలి, ఒకే చోట కూర్చుని గంటల తరబడి పని చేయడం, వ్యాయామం లేకపోవడం, ఒబెసిటీ, ఇతర ఆహారం అలవాట్లు, మోతాదుకు మించి మద్యం తీసుకోవడం లాంటివి ఫ్యాటీ లివర్ సమస్యకు కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో కాలేయం పాత్ర చాలా ముఖ్యమైనది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంతో పాటు అనేక పనులను కాలేయం చేస్తుంది. ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్.. తదితర వాటిని జీవక్రియ చేసి.. గ్లైకోజెన్, విటమిన్స్, ఖనిజాలను కాలేయం నిల్వ చేస్తుంది. అందుకే లివర్ ను కాపాడుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే లివర్ లో కొవ్వు శాతం ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అని వైద్యులు వివరిస్తున్నారు.
నిరంతర అలసటగా ఉండటం, అకారణంగా బరువు పెరగడం, మూత్రం ముదురు రంగులో రావడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారిపోవడం, పొత్తికడుపులో నొప్పి, వాపు రావడం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు.. తదితర పరిణామాలు ఫ్యాటీ లివర్ కు సంకేతాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ మూడు కూరగాయలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో చాలా సహాయపడతాయని వైద్యులు వివరిస్తున్నారు. బ్రోకోలీ , పాలకూర, కాకరకాయ తినడం ద్వారా లివర్ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్రోకోలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లివర్ లోని కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. అలాగే ఇది లివర్ డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. టాక్సిన్స్ తొలగించి లివర్ కణాలను రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. బ్రోకోలీని ఉడికించి లేదా సూప్ లో, వారం లో 3-4 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
ఇక పాలకూరలో గ్లుటతయోన్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్ కణాలను రీపేర్ చేస్తుంది. అలాగే పాలకూరలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ , ఫైబర్ లివర్ లో కొవ్వు నిల్వలు తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. తద్వారా లివర్ పై ఒత్తిడి తగ్గుతుందని వివరిస్తున్నారు. పాలకూర సూప్, కూర, జ్యూస్ రూపంలో రోజూ తీసుకోవచ్చట.

అలాగే కాకరకాయలో ఉన్న పాలి పెప్ టైడ్-P, మోమోర్డిసిన్ లివర్ లో ఫ్యాట్ నిల్వలు తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడమే కాకుండా.. ఫ్యాటీ లివర్ కు కారణమయ్యే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లివర్ ఎంజైమ్స్ స్థాయిలను సరిచేస్తుందని వివరిస్తున్నారు. కాకరకాయ జ్యూస్ లేదా వేపిన కూర రూపంలో వారం లో 2-3 సార్లు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
-
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications