ఇంట్లో ఉండే ఈ ఒక్క పదార్ధం చెబుతోంది ఆయుష్మాన్ భవ!
మన ఇంట్లో ఉండే పదార్థాల నుంచే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన వంటగది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే అపర సంజీవని. వంటగదిలో ఉండే చాలా పదార్ధాలు మనలను ఎన్నో రోగాల నుండి రక్షిస్తాయి. అలా వంటగదిలో నిత్యం మనం వంటల్లో ఉపయోగించే ఒక పదార్థం పసుపు మన ఇంట్లో ఉంటే చాలు మనం బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పసుపుతో చాలా ఉపయోగాలు
పసుపుతో మనకు కలిగే ఉపయోగాలు అన్ని ఇన్ని కాదు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది మన ఆహారంలో భాగంగా తీసుకోవడం మాత్రమే కాకుండా, పసుపును ప్రత్యేకంగా వివిధ పానీయాలతో తీసుకోవడం వల్ల మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి.

బరువు తగ్గటానికి పసుపు చాలు
ప్రస్తుతం ఎంతో మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటివారు ప్రతిరోజు ఉదయం వేడి నీళ్లలో కాస్త పసుపు తేనె వేసుకుని తాగినట్లయితే బరువు తగ్గడానికి పసుపు దోహదం చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ను, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
పసుపు మన ఆరోగ్యంపై అద్భుతం చేస్తుంది
పసుపు హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. పీసీఓడీ సమస్య ఉన్నవారిలో ఆ సమస్యను తగ్గించడానికి పసుపు ఉపయోగపడుతుంది. ఏవైనా గాయాలు అయితే గాయాలు మానడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు కాస్త వేడి నీటిలో పసుపు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్, క్యాన్సర్ కు పసుపే మందు
పసుపు మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా పసుపు నీళ్లు తాగడం వల్ల టైప్ టు డయాబెటిస్ ను నియంత్రిస్తుంది. పసుపు మన మెదడు పనితీరును మెరుగుపరిచి మతిమరుపు వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు పసుపులో అధికంగా ఉండడం వల్ల పసుపును ట్యూమర్ల పెరుగుదలను నియంత్రించడానికి క్యాన్సర్ కణాల విస్తరణను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications