భరించలేని మెంటల్ టెన్షన్స్.. అయితే ఇలా చెయ్యండి!

ఇటీవల కాలంలో మెంటల్ టెన్షన్ అనేది ఒక పెద్ద సమస్యలా తయారైంది.మానసిక ఒత్తిడితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించటం అనేది ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేక చాలామంది చిన్న చిన్న ఇబ్బందులకే ఆత్మహత్యలకు ప్పాల్పడుతున్నారు.

మానసిక ఉపశమనం కోసం ఇలా చెయ్యండి
ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడానికి, మానసికంగా ఉపశమనం పొందడానికి లోతైన శ్వాస తీసుకోవడం, ధ్యానం వంటివి చేయడం చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకొస్తుంది. మానసికంగా ఒత్తిడి తగ్గాలంటే మీకు ఇష్టమైన అభిరుచులను ఆస్వాదించాలి. చాలామందికి సంగీతం వినడం, డాన్స్ చేయడం, కథలు, కవితలు రాయడం ఇలా ఏవో అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచులను ఆస్వాదిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

Unbearable mental tensions follow these tips

వర్క్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి
మానసిక ఒత్తిడి తగ్గాలంటే ప్రకృతిలో సమయం గడపాలి. బయట నడవడం, ప్రకృతిలో సమయం గడపడం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు పనికి జీవితానికి మధ్య సమతుల్యత పాటించాలి. వర్క్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అలా బ్యాలెన్స్ చేస్తేనే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

వీటితో మానసిక ఒత్తిడి దూరం
నడవడం, యోగా చేయడం వంటి శారీరక కార్యకలాపాలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు మనం మన ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ అలవాట్లు మానుకోవాలి
మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు వీటిని మానుకోవాలి. అవి తాత్కాలికంగా మీకు ఉపశమనం ఇచ్చినట్టు అనిపించవచ్చు కానీ శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించలేవు. ఇవి దీర్ఘకాలంలో మీ ఒత్తిడిని మరింత పెంచుతాయి. కనుక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకుంటే పైన పేర్కొన్న వాటిని పాటించాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+