ఉప్పు తెల్లది కాదు నల్లది వాడండి.. నల్ల ఉప్పు అద్భుతాలు చూడండి!
మనం సాధారణంగా వంటలలో ఉప్పును వాడుతాం. అయితే చాలామంది వంటలు తెల్ల ఉప్పునే వాడుతారు. కానీ తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పు వాడటం చాలా మంచిదని నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అసలు నల్ల ఉప్పు, కాలా నమక్ తో ఉండేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
నల్ల ఉప్పుతో ఆరోగ్యం
నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి నల్ల ఉప్పును ఉపయోగిస్తారు. భారతీయ వంటల్లో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రుచిని పెంచడానికి శాకాహార వంటకాలలో ముఖ్యంగా దీనిని ఉపయోగిస్తారు. అటువంటి నల్ల ఉప్పు మన బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు వెయిట్ లాస్ అవ్వడానికి నల్ల ఉప్పు దోహదం చేస్తుంది.

నల్ల ఉప్పుతో ఈ అనారోగ్యాలకు చెక్
మన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నల్ల ఉప్పు నిర్వహిస్తుంది. దీనివల్ల కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, కడుపుబ్బరం మరియు అజీర్ణ సమస్యలను తగ్గించడానికి నల్ల ఉప్పు దోహదం చేస్తుంది. శరీరంలో మలబద్దకాన్ని తగ్గించి మోషన్ నార్మల్ గా అయ్యేలా చేస్తుంది. మన పేగు కదలికలను సులభతరం చేస్తుంది. నల్ల ఉప్పు జీర్ణ ఎంజైముల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
వీరు నల్ల ఉప్పును ఎక్కువ వాడటం మంచిది కాదు
నల్ల ఉప్పులో ఉండే ఖనిజాలు చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల ఉప్పును అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే నల్ల ఉప్పులో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు నుండి పావు స్పూను నుండి అర టీ స్పూన్ల మధ్య తీసుకుంటే మంచిది.
తెల్ల ఉప్పు కన్నా నల్ల ఉప్పు బెస్ట్
నల్ల ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని చెబుతారు. మనం సహజంగా ఉపయోగించే తెల్ల ఉప్పు కంటే, దీంట్లో మన ఆరోగ్యానికి దోహదం చేసే అనేక ఖనిజాలు ఉంటాయి. అందుకే నల్ల ఉప్పు తెల్ల ఉప్పు కంటే మంచిదని సిఫార్సు చేస్తారు.












Click it and Unblock the Notifications