ఉసిరికాయ ఆవ నిల్వ పచ్చడి ఇలా చేస్తే అద్భుతం.. తింటే మీకు ఆరోగ్యం!

ఇది శీతాకాలం .. ఉసిరికాయల సీజన్. ఈ సీజన్ లో ఉసిరికాయతో తయారు చేసే ఆవ నిల్వ పచ్చడి చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ అన్నంలో కొద్దిగా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మరి ఉసిరికాయ ఆవ పచ్చడి ఎలా తయారు చెయ్యాలి, దాంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం.

ఉసిరికాయ ఆవ నిల్వ పచ్చడి తయారీ విధానం
కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు - 1 కిలో
ఆవ పొడి - 200 గ్రాములు
ఎండు మిరపకాయలు - 150 గ్రాములు
ఉప్పు - 150 గ్రాములు అవసరానికి సరిపడా
మెంతులు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి - 1 కప్పు
నువ్వుల నూనె - 250 మిల్లీలీటర్లు

Usirikaya Ava Nilva Pachadi making process and health Benefits

తయారీ విధానం
ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టాలి. తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టాలి. ఆ తరువాత ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
ఎండు మిరపకాయలు, మెంతులు, ఆవాలు వేర్వేరుగా వేపి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక పెద్ద పాత్రలో ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, ఆవ పొడి, మిరప పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఇలా ఉంచితే బాగా నిల్వ ఉంటుంది
కొన్ని వెల్లుల్లి కచ్చాబచ్చాగా దంచి, కొన్ని పొట్టు తీసి వేసుకోవాలి.చివరగా నువ్వుల నూనె పోసి మిశ్రమాన్ని సమంగా కలిసేలా కలపాలి. ఈ పచ్చడిని శుభ్రమైన, పొడి గాజు సీసాలో నింపి మూత పెట్టి ఊరనివ్వాలి.3 నుండి 4 రోజులు ఎండలో లేదా గాలి తగిలే చోట ఉంచితే పచ్చడి బాగా నిల్వ ఉంటుంది.

ఉసిరికాయ ఆవ పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు
ఉసిరికాయ ఆవ పచ్చడితో జీర్ణశక్తి పెరుగుతుంది: ఉసిరికాయలోని సహజ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది: విటమిన్ C అధికంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉసిరికాయ ఆవ పచ్చడి తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జుట్టు, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది: ఉసిరి జుట్టు రాలడాన్ని తగ్గించి చర్మానికి కాంతినిస్తుంది.

ఉసిరికాయ ఆవతో షుగర్ కంట్రోల్.. కానీ వీరు ఎక్కువ తినొద్దు
షుగర్ నియంత్రణకు సహకారం అందిస్తుంది. అన్నంతో పాటు ఉసిరికాయ ఆవ పచ్చడి తింటే జీర్ణం సులభమవుతుంది. మసాలా తక్కువగా, ఉప్పు మితంగా ఉంటే రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఈ ఉసిరికాయ ఆవ పచ్చడిని తినకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+