Vastu tips: ఇంట్లో సంపద, శ్రేయస్సు, ఆనందం కావాలా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా సంపద, శ్రేయస్సు మరియు ఆనందం ఆ ఇంట్లో నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సంపద శ్రేయస్సు, సంతోషం ఉండాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ఇంట్లో శుక్రవారం నాడు 11గవ్వలను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టడం వల్ల ఆ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలతో తయారుచేసిన నాణేలను పూజ మందిరంలో పెట్టి పూజించి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది.

అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజా మందిరంలో ఐదు లేదా ఏడు ముఖాల దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఇంట్లో సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. కర్పూరాన్ని ఇంట్లో వెలిగించి ఇల్లంతా తిప్పడం వల్ల కూడా ఇంట్లో ప్రతికూలతలు దూరమై సంతోషం మరియు శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక పూజ స్థలంలో శ్రీ యంత్రాన్ని స్థాపించి, ఆ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఓం శ్రీం లేదా ఓం హ్రీం శ్రీం అనే కుబేర మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ధన లాభం పొందే అవకాశం ఉంటుంది. కుబేరుని ధ్యానిస్తూ ఈశాన్యంలో దీపం వెలిగించడం వల్ల కూడా ఇంటికి సంపద వస్తుంది.
ఇంటి ఈశాన్య మూలలో గంగాజలాన్ని చిలకరించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి, కనకధారా స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది. ఐదు తమలపాకులలో ఐదు లవంగాలు కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడదీయడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు, సంపద, ఆనందం వస్తుంది. ఈ నివారణలతో ఇంట్లోని వారు సంతోషంగా ఉండొచ్చని చెప్తున్నారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications