సెలబ్రిటీ ఫిట్ నెస్ సీక్రెట్.. వైరల్ ఎగ్ ఫ్రై.. ఇలా ఈజీగా..
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, కండరాల బలానికి, రోగనిరోధక శక్తికి తోడ్పడతాయి. అయితే ఎప్పుడూ కోడిగుడ్డుతో ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా..? వైరల్ ఎగ్ ఫ్రై గా ఇప్పుడు ఈ వంటకం ట్రెండ్ అవుతోంది.
వైరల్ ఎగ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఒకటి పచ్చి గుడ్డు, ఒకటి ఉడికించిన గుడ్డు, ఉప్పు, ఎర్ర కారం పొడి, పసుపు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లికాడలు తీసుకోవాలి.
వైరల్ ఎగ్ ఫ్రై తయారీ విధానం చూస్తే.. ముందుగా ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ పచ్చి గుడ్డు తీసుకుని ఒక గిన్నెలో ఆ గుడ్డును కొట్టి పోయాలి. అందులోనే కారం, ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత నూనె తగినంత పోయాలి. అందులో ఉడకబెట్టిన గుడ్డును వేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఉడకబెట్టిన గుడ్డుపై పోయాలి. ఆ మిశ్రమంపై తరిగిన ఉల్లికాడలు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలను చల్లాలి. లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే సూపర్ టేస్టీ వైరల్ ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications