ఈ ఒక్కటి చేయండి... నిత్యం యవ్వనంగా కనిపిస్తారు

ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ కూర్చొని పనిచేయడమే జరుగుతోంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 70 సంవత్సరాల వయసు దాటినవారు ప్రతిరోజు నడవడంవల్ల గుండెపోటు ప్రమాదాలకు దూరంగా ఉంటారని తేలింది.

వ్యాధుల ప్రమాదం తక్కువ
ప్రతిరోజూ 2000 అడుగుల కంటే తక్కువ నడిచే వారితో పోలిస్తే ప్రతిరోజూ 4500 అడుగులు నడిచేవారిలో వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం అదనంగా 500 అడుగులు నడవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల్లో 14 శాతం తగ్గింపు కనపడుతోంది. ప్రతిరోజు 500 అడుగులు నడవడంవల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.

walking is a boon for senior citizens

కనీసం 30 నిముషాలు
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు 30 నిముషాలు తక్కువ కాకుండా నడుస్తుండాలి. నడక గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది. స్ట్రోక్ సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు అరగంట నడుస్తుండటంవల్ల రోజు మొత్తం చురుగ్గా ఉంటారు.

టెన్షన్ తగ్గిస్తుంది
నడకవల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, డిప్రెషన్ లక్షణాలను దూరం చేయడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. నడక మనిషి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్, ఇతర డిమెన్షియాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు అరగంట తక్కువ కాకుండా నడుస్తుండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+