నెలకు కనీసం 5కిలోల బరువైనా తగ్గాలనుందా? అయితే ఇలా చెయ్యండి!!

చాలామంది బరువు తగ్గాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనీసం నెలకు 5 కిలోల బరువైనా తగ్గితే బాగుండు అని భావించేవారు ఎంతోమంది ఉంటారు. ఇక అటువంటివారు నెలలో ఐదు కిలోల బరువు తగ్గాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు, వ్యాయామ నిపుణులు. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

నిజ జీవితంలో మనం కొన్ని సాధారణ నియమాలను పాటించడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. క్రమబద్ధమైన జీవితం బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. ఇక బరువు తగ్గేందుకు చెయ్యాల్సిన పనులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భోజనానికి అరగంట ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. ఉదయం భోజనానికి ముందు ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగాలి. మధ్యాహ్నం గాని సాయంత్రం కానీ మళ్ళీ గ్రీన్ టీ తాగితే మంచిది.

Want to loose weight at least 5kg in a month? then follow these weight loss tips!!

అయితే ఇందులో చక్కెర అసలు వేసుకోకూడదు. ఇక భోజనం చేసేటప్పుడు అన్నాన్ని నెమ్మదిగా నమలి తినాలి.ప్రతిరోజు పైనాపిల్ తింటే మంచిది. అయితే పరిమిత మోతాదులోనే తినాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వేరే దేనిపైనా శ్రద్ధ పెట్టకుండా వేగంగా నడవాలి. కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. చక్కెర పదార్థాలు, స్వీట్లు అస్సలు తినకూడదు.

చక్కెరకు బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర పోవాలి. ఇక బరువు తగ్గాలనుకునేవారు బర్గర్లు, చిప్స్, ఐస్ క్రీములు, ఫాస్ట్ ఫుడ్స్, వంటి వాటిని అస్సలు తినకూడదు. ఆహారంలో బియ్యాన్ని తెల్లటి పిండిని, పంచదార కలిగిన పానీయాలను, అనారోగ్యకరమైన నూనెలను అస్సలు తినకూడదు.

తక్కువ కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. ప్రోటీన్ లు, విటమిన్లు మరియు మాంసాహార ఆహారాలపై ఎటువంటి పరిమితి లేదు. అయినా తీసుకునే క్వాంటిటీ విషయంలో జాగ్రత్త. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన భోజనం మీ బరువును గణనీయంగా తగ్గిస్తాయి. ఇలా ప్రతిరోజు చేస్తే నెలలో ఖచ్చితంగా 5 కిలోలు బరువు తగ్గి తీరుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+