వేగంగా బరువును తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ వాటర్ ట్రై చెయ్యండి
ఊబకాయం ఇప్పుడు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి ఊబకాయంతో చాలామంది బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం బరువు తగ్గొచ్చు అనే విషయాన్ని పలువురు ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో ముఖ్యంగా మన వంటగదిలో పోపు దినుసులలో ఉపయోగించే జీలకర్ర మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుందని చెబుతున్నారు.
జీలకర్ర నీరు తాగితే మంచిది
జీలకర్రలో అద్భుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్యపరంగా జీలకర్ర మనకు ఎంతో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు మనం జీలకర్ర నీటిని తాగడం వల్ల అదనపు బరువును తగ్గించుకోవచ్చని అంతేకాదు జీర్ణక్రియను, జీవ క్రియలను మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు. జీలకర్ర గింజలను రాత్రిపూట నానబెట్టి ఖాళీ కడుపుతో నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుందని చెబుతున్నారు.

జీలకర్రలోని ఫైబర్ తో మేలు
జీలకర్రలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయని సూచిస్తున్నారు.జీలకర్రలో ఉండే ఫైబర్ కంటెంట్ మనల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుందని, కడుపు నిండుగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని అధికంగా ఆహారాన్ని తీసుకోవడాన్ని ఇది నియంత్రిస్తుందని చెబుతున్నారు.
జీలకర్రతో షుగర్ కంట్రోల్
జీలకర్రలో ఉన్న కార్మినేటివ్ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేసి సరైన పోషకాలను గ్రహించేలా చేస్తాయని, నీరు నిలుపుదలను తగ్గిస్తాయని అంటున్నారు. జీలకర్ర నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని సూచిస్తున్నారు, జీలకర్ర వాటర్ ఆర్థరైటిస్ ను తగ్గిస్తుందని, మన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించేలాగా చూస్తుందని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడే జీలకర్ర
జీలకర్ర వాటర్ మన గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తుందని, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు గుండె సమస్యలు రాకుండా చేస్తాయని చెబుతున్నారు. జీలకర్ర వాటర్ అద్భుతమైన ప్రయోజనాలు అందించినప్పటికీ బాగా బరువు తగ్గాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమని అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయాలని చెబుతున్నారు..
జీలకర్ర నీళ్ళతో ప్రయోజనం
జీలకర్ర నీటిని తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ గింజలను వడకట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలని ఇలా తాగడం జీలకర్ర యొక్క క్రియాశీల సమ్మేళనాల ప్రయోజనాలను పెంచుతుందని చెబుతున్నారు .
జీలకర్రను ఈ మోతాదులో తీసుకోండి
అయితే జీలకర్రను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకునే వారు ఒకటి నుండి రెండు స్పూన్ల జీలకర్ర పొడి లేదా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర విత్తనాలను మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఇక జీలకర్ర నీటిని నిజంగా తాగాలనుకునేవారు పరగడుపున ఉదయం తాగితేనే దీని యొక్క ప్రయోజనాలు మన శరీరానికి ఉపయోగపడతాయని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications