వయగ్రా వాడుతున్నారా..?

ఒకప్పుడు స్తంభన లోపం వంటి పురుష లైంగిక సమస్యలను చాలా వరకూ మానసిక సమస్యలుగానే పరిగణించి కొట్టిపారేసేవాళ్లు, లేదంటే 'కౌన్సెలింగ్' వంటివి ఇచ్చేవారు. అయితే శాస్త్రీయమైన పరిశోధన, అవగాహనలు పెరిగిన కొద్దీ ఈ సమస్యలను కేవలం మానసిక సమస్యలుగా భావించటం సరికాదనీ, వీటికి శారీరకమైన లోపాలు, సమస్యలు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు.

ముఖ్యంగా హార్మోన్ సమస్యలు, దీర్ఘకాలిక మధుమేహం, రక్తనాళాల సమస్యలు, నాడుల పనితీరు తగ్గటం వంటి ఎన్నో అంశాలు స్తంభన పటుత్వాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పురుషుల లైంగిక సామర్ధ్యాన్ని తక్షణం, తాత్కాలికంగా పునరుద్ధరించటంలో వయాగ్రా ముఖ్యపాత్ర పోషిస్తోందని పలువురు సెక్సాలజిస్ట్‌లు అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో జంటలు విడాకుల వరకూ వెళ్లకుండా చూడటంలో కూడా వయాగ్రా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

What Are The Side Effects of Viagra

స్తంభన లోపమన్నది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్క అమెరికాలోనే మొత్తం పురుషుల్లో 10 శాతం మందికి స్తంభన లోపాలున్నట్టు అంచనా. 40-70 ఏళ్ల మధ్య వయసు వారిలో కనీసం సగం మంది దీనితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి రుగ్మతలు పెరుగుతున్న నేపథ్యంలో స్తంభన లోపమూ బాగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో అవసరాన్ని బట్టి వైద్యుల పర్యవేక్షణలో వయాగ్రా వంటి తక్షణ పరిష్కారాలను ఆశ్రయించవచ్చుగానీ సమస్యకు మూలాల్ని గుర్తించి.. చికిత్స తీసుకోవటం మరింత ముఖ్యం.అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి 2014 నాటికి సరిగ్గా పదేళ్లవుతోంది. ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు. వయాగ్రా వేసుకున్న గంటలో అది రక్తంలో కేంద్రీకృతం అవుతుంది.

అందుకే వైద్యులు సెక్సుకు ఒక గంట ముందు వయాగ్రాను తీసుకోవాలని సూచిస్తారు. వయాగ్రా వేసుకున్న తర్వాత ఒకసారి స్కలనమైనా, మళ్లీ ఇంకోసారి సెక్స్ చేయొచ్చు. అయితే, 4 గంటల తర్వాత అది క్రమేనా ప్రభావం తగ్గుతుంది. అయితే వైద్యుడి సలహా మేరకు మాత్రమే వయగ్రాను వాడాలి . వయగ్రా వాడకానికి కొన్ని దుషప్రభావాలు ఉండవచ్చు. అంతేకాకుండా కొన్ని ఇతర మందులతో పరస్పర చర్య చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వైద్య సలహా తీసుకోకుండా వాడకపోవడమే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+