ఏపీలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఏమిటి? చికిత్స ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న గులియన్ బారె సిండ్రోమ్ అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి? ఈ వ్యాధి మనిషి ప్రాణాలను హరించేంత తీవ్రమైన వ్యాధినా? ఈ వ్యాధికి చికిత్స ఉందా? ఇప్పుడు ఏపీవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏపీని వణికిస్తున్న ఈ వ్యాధి పైన చర్చ జరుగుతుంది.
గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు
గులియన్ బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే ఒక పరిస్థితి. ఇది మన శరీర బలహీనతకు తిమ్మిర్లకు పక్షవాతానికి కారణంగా మారుతుంది. ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణాలు చేతులు మరియు కాళ్లల్లో బలహీనత మరియు జలదరింపు అయితే ఈ లక్షణాలు శరీరమంతా త్వరగా వ్యాప్తి చెంది పక్షవాతానికి దారి తీస్తాయి . ఆపై ఇది అత్యంత తీవ్రమైన అత్యవసర వైద్యపరిస్థితిగా మారుతుంది.

చేతులు లేదా ముఖంలో మొదటి లక్షణాలు
గులియన్ బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. దీనికి ఖచ్చితమైన కారణాలేవీ ఉండవు. ఈ వ్యాధి కారణంగా తరచుగా పాదాలు కాళ్లల్లో జలదరింపు వస్తుంది. బలహీనత కలుగుతుంది. ఇది శరీరం మరియు చేతులకు వ్యాపిస్తుంది. కొంతమంది వ్యక్తులు చేతులు లేదా ముఖంలో మొదటి లక్షణాలను గమనిస్తారు. ఈ కండరాల బలహీనత క్రమంగా పక్షవాతంగా మారుతుంది.
గులియన్ బారే సిండ్రోమ్ తో ఈ సమస్యలు కూడా
అంతే కాదు ఈ వ్యాధి సోకినప్పుడు అస్థిరంగా నడవడం లేదా నడవలేకపోవడం మెట్లు ఎక్కడం సాధ్యం కాకపోవడం జరుగుతుంది. మాట్లాడడం, నమలడం, మింగడం వంటి ముఖ కదలికలలో కూడా సమస్యలు వస్తాయి. కళ్ళు కదల లేకపోవడం, రెండుగా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రమైన నొప్పులు వేధిస్తాయి. వేగవంతమైన హృదయ స్పందన రేటు ఉంటుంది. రక్తపోటు తక్కువగానో లేదా అధికంగానో ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది.
గులియన్ బారే సిండ్రోమ్ కు చికిత్స ఉందా?
గులియన్ బారే సిండ్రోమ్ కు ఖచ్చితమైన చికిత్స లేదు. ఈ వ్యాధి కారణంగా మనిషికి వచ్చిన లక్షణాలను తగ్గించడానికి మాత్రమే చికిత్స చేస్తారు. కొంతమంది ఈ వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకున్న ఆరు నెలల తర్వాత మళ్లీ నడవగలుగుతారు. ఇంకొంతమందికి బలహీనత, తిమ్మిరి, అలసట వంటి శాశ్వతమైన ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. కొంతమంది కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడితే కొంతమంది ఈ వ్యాధితో ప్రాణాలే కోల్పోతారు.
తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి
అయితే ప్రారంభ దశలో వైద్యుని వద్దకు వెళితే వ్యాధి వ్యాప్తి కాకుండా తీవ్రతరం కాకుండా చికిత్సతో తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. కాబట్టి ఈ వ్యాధి విషయంలో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే రోగి పూర్తిగా కోలుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications