సడన్‌గా వ్యాయామం చేయడం ఆపేస్తే ఏమవుతుంది?
వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కానీ, వారాలు, నెలలుగా క్రమంగా చేస్తూ వచ్చిన వ్యాయామాన్ని అకస్మాత్తుగా ఆపడం శరీరానికి అనేక మార్పులను తీసుకురావచ్చు. వ్యాయామాన్ని సడన్‌గా ఆపితే శారీరక, మానసిక ఆరోగ్యంలో మార్పులు జరగటం సహజం. శరీరం రొటీన్‌కు అలవాటు పడిన తర్వాత, వ్యాయామాన్ని ఆపడం వల్ల శరీరం అదే స్థాయిలో చురుకుదనం, శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఏదైనా అనారోగ్యం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల వ్యాయామం ఆపవలసి వస్తే, ఒక్కసారిగా ఆపకుండా క్రమంగా తగ్గించుకోవడం మంచిది.
సడన్‌గా వ్యాయామం ఆపడం వల్ల కలిగే ప్రభావాలు
1. శక్తి స్థాయి తగ్గిపోవడం
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం శరీరంలో శక్తి స్థాయులను పెంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, శరీర కణాల్లో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. సడన్‌గా వ్యాయామం ఆపితే, శరీరం అదే స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేయడం తగ్గి అలసటను కలిగిస్తుంది. దీనివల్ల దినచర్యలో శక్తి తక్కువగా అనిపిస్తుంది.

2. బరువు పెరగడం
వ్యాయామం శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది, దీనివల్ల ఫ్యాట్ బర్నింగ్ మెరుగ్గా జరుగుతుంది. సడన్‌గా వ్యాయామం ఆపితే, మెటబాలిజం రేటు తగ్గిపోతుంది, ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల కొంతకాలానికి బరువు పెరుగుతూ ఉంటారు.
3. గుండె ఆరోగ్యం
రెగ్యులర్ వ్యాయామం గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది, హార్ట్ రేటు మెరుగుపరుస్తుంది. సడన్‌గా ఆపడం వల్ల రక్తపోటు స్థాయిలు పెరగడం లేదా మార్పు చెందే అవకాశం ఉంటుంది. కొంతకాలం తర్వాత గుండె సంబంధిత సమస్యలు రావచ్చు.
4. కండరాలు బలహీనం
కొన్ని రకాల వ్యాయామాలు, ముఖ్యంగా కండరాలను బలపరచే వాటిని సడన్‌గా ఆపితే కండరాలు బలహీనంగా మారతాయి. ఇది క్రమంగా కండరాలను బలహీనతకు గురిచేస్తుంది. దీనివల్ల తేలికపాటి పనులు చేయడంలో కూడా కండరాలు అలసిపోతాయి, పునరావాస సమస్యలు కలుగుతాయి.
5. మానసిక ఒత్తిడి
వ్యాయామం మనసుకు శాంతిని అందిస్తుంది. ఇది ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లను విడుదల చేయడంలో సహకరిస్తుంది, ఇవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. సడన్‌గా వ్యాయామం ఆపడం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తలెత్తవచ్చు.
6. రక్తం మరియు రక్త ప్రసరణ సమస్యలు
రెగ్యులర్ వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. వ్యాయామాన్ని సడన్‌గా ఆపితే, రక్త ప్రసరణ సరిగా లేక, కాళ్లలో వాపు, నొప్పి వంటి సమస్యలు రావచ్చు.
పరిష్కారాలు- జాగ్రత్తలు
వ్యాయామాన్ని పూర్తిగా ఆపక ముందు మెల్లగా తగ్గించుకోవడం ఉత్తమం. రోజువారీ వ్యాయామ సమయంలో తేలికైన వ్యాయామాలు, యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలను కొనసాగించడం ద్వారా శరీరాన్ని మానసికంగా చురుకుగా ఉంచుకోవచ్చు. వ్యాయామం ఆపినప్పుడు, ఆహారంలో సరైన పోషకాలు పొందడం ద్వారా శరీరానికి కావలసిన శక్తిని అందించవచ్చు.












Click it and Unblock the Notifications