తామర గింజలు( ఫూల్ మఖానా) తింటే లాభమేంటి?
తామర గింజలు.. ఫూల్ మఖానాగా పిలుచుకునే ఈ గింజలను ఆహారంలో భాగంగా చాలామంది తీసుకుంటూ ఉంటారు. కొంతమందికైతే ఈ తామర గింజల గురించి తెలియనే తెలియదు. అయితే ఫుల్ మఖనా బోలెడు పోషకాల ఖజానా అని కచ్చితంగా చెప్పాల్సిందే. తామర గింజలలో ఉండే పోషకాలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. తామర గింజలలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేడ్లు పుష్కలంగా ఉంటాయి.
తామర గింజలతో ఆరోగ్యం
వీటిని కొంతమంది పచ్చిగానే తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టుకుని తింటుంటారు. ఇంకొందరు వేయించుకొని, కొంతమంది కూరలలో వండుకొని, పొడి చేసుకుని పాలల్లో కలుపుకుని తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు వీటితో స్వీట్లు కూడా తయారు చేస్తారు ఎలా తీసుకున్నప్పటికీ తామర గింజలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఫూల్ మఖానా తో బాగా బరువు తగ్గుతారు.

నరాల పనితీరును మెరుగుపరిచే ఫూల్ మఖానా
దీనిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ మనకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. ఫలితంగా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాం. అధిక బరువును తగ్గించుకుంటాం. ఫూల్ మఖానాలో ప్రోటీన్లు ఫైబర్ తో పాటు క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనత, జీర్ణ సంబంధిత సమస్యలను తలెత్తకుండా చేస్తాయి. ఫూల్ మఖానాలో ఉండే మెగ్నీషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్, ఆర్ధరైటిస్ లకు చెక్ పెట్టే ఫూల్ మఖానా
తామర గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్ లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనలను ఎన్నో రోగాల నుండి కాపాడతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ తదితర సమస్యల నుండి మనుషులను కాపాడతాయి. తామర గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఇవి డయాబెటిస్ ను నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాల సమాహారం.. తామర గింజల ఆహారం
మలబద్దకంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. ఫూల్ మఖాన గర్భిణీలకు కూడా మేలు చేస్తుంది. వారిలో రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. తామర గింజలు కీళ్ల సమస్యలతో పాటు, దంత సమస్యలతో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తాయి. తామర గింజలు బిపిని నియంత్రిస్తాయి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఫూల్ మఖానతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖంపై మొటిమలు రాకుండా ముడతలు పడకుండా ఫూల్ మఖాన చూస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications