గుండెపోటుకు, గ్యాస్ నొప్పికి తేడా తెలుసుకోండి!
ప్రస్తుతం ఎక్కడ వార్తలు చూసినా చిన్న వయసులోనే గుండెనొప్పితో మరణించినవారి గురించే ఉంటున్నాయి. అయితే ఇలా మృతిచెందినవారిలో గుండెపోటుకు, గ్యాస్ వల్ల వచ్చే నొప్పికి మధ్య తేడా ను గమనించలేకపోతున్నారు. ప్రస్తుత జీవన విధానం ఎంతో వైవిధ్యంగా ఉండటంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయి అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నొప్పి వస్తున్నా ఇది నార్మల్ గా వచ్చే నొప్పే కదా అని అనుకుంటున్నారు.
ఇలాంటి నొప్పి కొన్నిసార్లు గుండెపోటుకు దారితీస్తుంది. అందుకు ముందుగానే కొన్ని లక్షణాలు కనపడతాయి.. వాటిని జాగ్రత్తగా గమనించాలి. కొందరికి భుజాల నుంచి తలవరకు నొప్పి వస్తుంది. మరికొందరిలో చెమటలు పట్టడం, ఆవలింతలు రావడం, తేన్పులవంటి లక్షణాలు కనపడతాయి. చాలామంది ఇటువంటి సంకేతాలు కనిపించినప్పటికీ గ్యాస్ వల్లే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. తీవ్రత ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయాలవల్ల కూడా గుండెనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని, వాటిని తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.

* గుండె నొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి ఉండటంతోపాటు ఛాతీ అంతా బరువుతో కూడిన నొప్పి ఉంటుంది.
* గ్యాస్ నొప్పి మనం వేలుతో పాయింట్ చేసేంత స్థలంలోనే ఉంటుంది. ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఆ నొప్పి ఉంటుంది.
* ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది.
* పడుకున్నప్పుడు గ్యాస్ వెనక్కి వెళ్తుంది. కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకేచోట ఉంటుంది.
-
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications