వాకింగ్ న్యుమోనియా అంటే ఏమిటి? ఇది ఆరోగ్యానికి ప్రమాదమా?

వాకింగ్ న్యుమోనియా (Walking Pneumonia) అనేది సాధారణ న్యుమోనియాకు తేలికపాటి రూపం. ఇది ఒక శ్వాసకోశ వ్యాధి, అయితే దీనిలో లక్షణాలు సాధారణంగా తీవ్రమైనవిగా ఉండవు. ఇది ఎక్కువగా మైకోప్లాస్మా న్యుమోనియే (Mycoplasma pneumoniae) అనే బ్యాక్టీరియా ద్వారా సంభవిస్తుంది. "వాకింగ్ న్యుమోనియా" అని పిలవబడటానికి కారణం, బాధితులు సాధారణ జీవనశైలిలో భాగస్వామ్యమవుతూ, ఆసుపత్రి చికిత్స అవసరం లేకుండా కదలికలో ఉండగలగడమే.

వాకింగ్ న్యుమోనియా కారణాలు,
వాకింగ్ న్యుమోనియాకు ప్రధాన కారణం మైకోప్లాస్మా న్యుమోనియా అనే బ్యాక్టీరియా. కొన్ని రకాల వైరస్‌లు కూడా దీనికి కారణమవుతాయి. ఈ వ్యాధి దగ్గు, తుమ్ము ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గినవారికి ఈ వ్యాధి రావడం తరచూ వస్తుంటుంది. ఈ వ్యాధిని రక్తపరీక్షల ద్వారా లేదా ఛాతీ ఎక్స్-రే ద్వారా నిర్ధారిస్తారు.శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించడానికి వైద్యులు శరీర పరీక్ష చేస్తారు.

What is walking pneumonia Is it a health hazard

లక్షణాలు
వాకింగ్ న్యుమోనియా వల్ల ప్రధానంగా దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, శరీర నొప్పులు వంటి లక్షణాలు కలిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. పొడి దగ్గుగా ప్రారంభమై అనంతరం కఫం కలిగిన దగ్గుగా మారుతుంది. తేలికపాటి జ్వరం, తలనొప్పి, ఎటువంటి కష్టం లేకపోయినా శరీరం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది.

వాకింగ్ న్యుమోనియాకు చికిత్స
వాకింగ్ న్యుమోనియా చికిత్సకు ప్రధానంగా మాక్రోలైడ్స్ వంటి యాంటీబయాటిక్స్ (Macrolides) ఉపయోగిస్తారు. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచి ఆహారం తీసుకోవాలి. సర్దు, దగ్గు తగ్గడానికి గోరు వెచ్చని నీటిని తాగాలి. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. రోగులతో నేరుగా కాంటాక్ట్ తగ్గించాలి. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం, వ్యాయామాలు చేసుకోవాలి.

వాకింగ్ న్యుమోనియా సాధారణ న్యుమోనియాతో పోలిస్తే తక్కువ ప్రమాదకరమైనది. తగిన వైద్య చికిత్స, ఆరోగ్యపరమైన జీవనశైలితో దీన్ని సులభంగా ఎదుర్కోవచ్చు. లక్షణాలను గుర్తించి, త్వరగా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+