వేసవిలో చర్మ సౌందర్యం కోసం చెయ్యాల్సిందిదే!!
వేసవికాలం రానే వచ్చింది. వేసవికాలం చెమట, చిరాకుతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎండలో బయటకు వెళ్లి వచ్చినవారు చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే వేసవికాలంలో ఎటువంటి చర్మ సమస్యలు వస్తాయి? చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చర్మ సంరక్షణ కోసం ఇలా చెయ్యండి
వేసవికాలంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చర్మాన్ని కాపాడుకోవాలి అని భావించేవారు సూర్యుని ఎండకు నేరుగా గురికాకుండా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. క్యాప్, గొడుగు, సన్ గ్లాసెస్ వంటివి ధరించాలి. అంతేకాదు ఎండాకాలం చర్మ సంరక్షణ కోసం తరచూ నీటిని తాగాలి. శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి.

వేసవికాలం చర్మాన్ని కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యానికి తేలికపాటి మాయిశ్చరైజర్స్ ఉపయోగించాలి. చల్లని నీళ్లతో స్నానం చేయాలి. ఎండాకాలం రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవాలి. చెమట ఎక్కువగా పడుతున్న వారు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. వదులుగాను ఫ్రీగానూ ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. ఇక ఎండాకాలంలో జిడ్డు,కారం ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఈ ఆహారాలతో చర్మ సంరక్షణ
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజా పండ్లను, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక రసాయనాలు ఎక్కువగా ఉండే సౌందర్య సాధనాలను ఉపయోగించకూడదు. చర్మానికి సరిపడే ఉత్పత్తులను మాత్రమే చర్మ సంరక్షణ కోసం వాడాలి. ఇక ఎండాకాలంలో ముఖం మీద వచ్చే మొటిమలను గిల్లటం, నొక్కటం వంటివి చేయకూడదు. అవి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications