టూత్ బ్రష్ ను ఎంతకాలం వాడాలో తెలుసా?

శరీరంలో చాలా ముఖ్యమైన భాగం దంతాలు. మనిషి చిరునవ్వుకు అందాన్ని జోడించేది ఈ దంతాలే. తమ పళ్లు తెల్లగా మిలమిల్లాడుతూ ఉండాలని చాలామంది అనుకుంటుంటారు. వీటికోసం వివిధ మార్గాలను అన్వేషిస్తారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదానికి సంబంధించిన టూత్ పేస్ట్ ను వాడతారు. మరికొందరు మాత్రం హోం రెమిడీలను ప్రయత్నిస్తుంటారు. చాలామంది బ్రష్ లను విరిగిపోయేవరకు వాడుతుంటారు.

ఒకే టూత్ బ్రష్ ను పదే పదే ఉపయోగించడంవల్ల నోటిలో దంతాల సమస్యలకు గురవుతారు. ప్రతి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు టూత్ బ్రష్ ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రష్ విరిగిపోయేంతవరకు ఎవరూ వాడొద్దని సూచిస్తున్నారు. కుటుంబంలో పళ్ల సమస్యలు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు రెండునెలలకు ఒకసారి బ్రష్ ను మారుస్తుండాలి.

when to change your toothbrush?

టూత్ బ్రష్ ముళ్ళగరికెలు దంతాలను శుభ్రం చేయడంతోపాటు సూక్ష్మక్రిములను తొలగిస్తాయి. దీర్ఘకాలం ఉపయోగించడంవల్ల బ్రష్ పై ఉండే బ్రిస్టల్స్ బలహీనపడతాయి. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతోపాటు వైరస్ లు, శిలీంధ్రాలు దంతాల్లో చేరతాయి. కొన్ని రోజుల తర్వాత టూత్ బ్రష్ ను వేడినీళ్లల్లో కొంచెం సమయం ఉంచడం మంచిది.

టూత్ బ్రష్‌ని ఎక్కువసేపు వాడడం వల్ల బ్యాక్టీరియా జెర్మ్స్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. దీనివల్ల దంతాలు, చిగుళ్ల సంక్రమణ ప్రమాదం కలుగుతుంది. కొందరు అదేపనిలో పళ్లపై అనామిల్ దెబ్బతినేలా చాలా గట్టిగా బ్రష్ ను వాడుతుంటారని, అలాచేయడంవల్ల పళ్లు, చిగుళ్లు, దంతాలు దెబ్బతింటాయని, బ్రిస్టల్స్ మృదువుగా ఉండే బ్రష్ లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+