బరువు తగ్గలన్నా, డయాబెటిస్ కంట్రోల్ కావాలన్నా ఈ సీడ్స్ తినండి చాలు!

ఫ్లాక్స్ సీడ్స్.. ఈ మధ్యకాలంలో మన ఆరోగ్యానికి దోహదం చేసే గింజలలో ఒకటిగా వీటిని ప్రధానంగా సూచిస్తున్నారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చూడడానికి నల్లగా చిన్నగా ఉన్నప్పటికీ ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు మనం ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ను తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అవిసె గింజలతో హాయ్ కొలెస్ట్రాల్ కు చెక్
చాలామంది ఇటీవల హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. బాడ్ కొలెస్ట్రాల్ , ట్రై గ్లిజరైడ్ సమస్యతో బాధపడుతున్న వారికి అవిసె గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ తో గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఈ గింజలను ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు.

Whether you want to lose weight or control diabetes just eat these flax seeds

అవిసె గింజలతో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ
అవిసె గింజలలో ఫైబర్ తో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉండడం వల్ల అవిసె గింజలు కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు అవిసె గింజల్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో కూడా సహాయం చేస్తాయని చెబుతున్నారు.

బరువు తగ్గాలన్నా బెస్ట్ ఆప్షన్
అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రతిరోజు మనం రెండు స్పూన్ల అవిసె గింజలను తీసుకుంటే మన శరీరానికి కావలసిన ఫైబర్ చక్కగా అందుతుంది. ఇది మన జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

అవిసె గింజలతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా
ఇక డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఈ సీడ్స్ లో ఉండే లిగ్నాన్స్ శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తాయి. మనకు పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. తరచూ అవిసె గింజలను తినడం వల్ల జుట్టుకి ఆరోగ్యం చేకూరుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలలో హార్మోన్ అసమతుల్యత తగ్గుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవిసె గింజలను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

disclaimer: ఈ కథనం సౌందర్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+