ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వంటనూనె వాడితే మంచిది?
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవడం కోసం ఆరోగ్యకరమైన నూనెలను వాడాలి. అయితే ఏ నూనె మంచిది? ఏ నూనె వాడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.
వంటకు ఏం నూనె వాడాలి?
మనం వంట నూనెలను ఉపయోగించేటప్పుడు చాలామంది పల్లి నూనె కంటే సన్ ఫ్లవర్ నూనె మంచిదని చెబుతారు. కొంతమంది రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిదని సూచిస్తారు. ఇంకొంతమంది వంటకు ఆలివ్ నూనె అంత శ్రేష్టమైన ఆయిల్ ఇంకొకటి లేదని చెబుతారు. అయితే ఇంతకీ ఏ ఆయిల్ మంచిది అంటే.. ప్రతి ఆయిల్ లోను దేనికదే గొప్ప గుణాలు ఉంటాయి.

ఈ నూనెలలో గొప్ప గుణాలు
ఆలివ్ ఆయిల్ హృదయానికి మేలు చేస్తుంది . సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. ఇది మన గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక పల్లి నూనెలో మన ఎముకలకు బలాన్ని ఇచ్చే పోషకాలు ఉంటాయి. ఇది కూడా మనకు మంచి పుష్టిని ఇస్తుంది. నువ్వుల నూనె రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొబ్బరి నూనె జీర్ణక్రియకు ఎంతో బాగా పనిచేస్తుంది.
ఏ నూనెకు ఆ నూనె ప్రత్యేకమైనవి
ఆవనూనె మన శరీరంలో రక్తప్రసరణకు బాగా ఉపయోగపడుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక వర్జిన్ ఆలివ్ ఆయిల్ సలాడ్లలో ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే ఏ నూనెకు ఆ నూనె ప్రత్యేకమైనది. ఇందులో ఇది మాత్రమే శ్రేష్టమైంది అని చెప్పడానికి వీల్లేదు.
నూనె వినియోగంలో ఈ విషయాలు మర్చిపోవద్దు
మన మార్కెట్లో దొరికే ప్యాకింగ్ చేసిన ఆయిల్స్ చాలావరకు కల్తీ ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఏ నూనె అయినా గానుగ నుండి పట్టించి తీసుకుని ఉపయోగిస్తే మంచిది. అలాగే నూనెలను ఉపయోగించేటప్పుడు ఎప్పటికీ ఒకే నూనె కాకుండా వాటిని మార్చి వినియోగిస్తూ ఉంటే మంచిది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నూనెను ఎప్పుడు మితంగా వాడాలి. నూనె అధిక వినియోగం ఆరోగ్యానికి హాని చేస్తుంది. మనం ఏ నూనె ఉపయోగించినప్పటికీ దానిని కొద్ది మోతాదులోనే ఉపయోగించాలి. నూనె తక్కువ వినియోగించినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications