ఊబకాయం ఎందుకు వస్తుంది? తగ్గటానికి ఏం చెయ్యాలి? తెలుసుకోండి!
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం కారణంగా చాలామంది చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఊబకాయంతో పాటు వచ్చే సమస్యలతో కొంతమంది చిన్న వయసులోనే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే అసలు ఊబకాయం రావడానికి కారణాలు ఏమిటి? ఎందువల్ల ఊబకాయం వస్తుంది? అన్నది ప్రస్తుతం తెలుసుకుందాం.
ఊబకాయం ఇందుకే
ప్రస్తుతం ఇళ్లల్లో వండుకునే వారి సంఖ్య బాగా తగ్గుతుంది. సమయానికి కడుపు నింపుకోవడం కోసం బయట దొరికే ఇన్స్టెంట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. చాలామంది అయితే ఆహారంలో వాడే హానికరమైన మసాలాలు, నూనెల కారణంగా మన శరీరానికి అవసరానికి మించిన క్యాలరీలు అందడం వల్ల కొవ్వు పెరిగిపోతుంది. ఇక ఈ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం కోసం కనీసం వ్యాయామమైనా చేయాలి.

నిద్రలేమితో ఊబకాయం సమస్య
ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి కూడా సమయం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. శరీర భాగాలు ప్రతిరోజూ కదిలించకపోతే వ్యాయామం చెయ్యకపోతే కచ్చితంగా ఉబకాయ బాధితులుగా మారతారని చెబుతున్నారు. అంతేకాదు శరీరానికి సరిపడా నిద్ర లేకపోయినా ఊబకాయం సమస్య వస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితోనూ ఆందోళనతోను ఊబకాయ బాధితులుగా మారతారని హెచ్చరిస్తున్నారు.
ఊబకాయ బాధితులు కావొద్దంటే ఇలా చెయ్యండి
ఊబకాయ బాధితులుగా మారకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ విషయాలపైన శ్రద్ధ వహించాలి. తీసుకునే ఆహారం పట్ల అవగాహన ఉండాలి. ప్రతిరోజు మనం ఏం తింటున్నాం? ఏం తినకూడదు? అనే విషయాలు తెలుసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలతో పాటు పోషకాహారాన్ని ఎంచుకొని తినాలి. ఇక వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ అలవాట్లతో ఊబకాయానికి చెక్
రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించడానికి రెండు గంటల ముందే భోజనాన్ని పూర్తిచేయాలి. రాత్రి వేళల్లో ఫోన్ వాడకం తగ్గించి 7 , 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం, యోగ వంటివి చేయాలి. ఇలా చేస్తే ఊబకాయం సమస్య నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఊబకాయ సమస్యను అధిగమించాలి అనుకునేవారు ఎందుకు బరువు పెరుగుతున్నామనేది తెలుసుకోవాలి. తదనుగుణంగా బరువు తగ్గే మార్గం చూడాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications