గంటలో తెల్లజుట్టు నల్లగా మారుతుంది!
నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తెల్ల వెంట్రుకలు. తక్కువ వయసులోనే వస్తుండటంతో శాశ్వత పరిష్కారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హెయిర్ డై వల్ల శరీరానికి హాని జరుగుతుందని తెలిసినా వాడుతున్నామని, సహజంగా ఏవైనా ఉంటే తెలపాలంటూ వైద్యులను కోరుతుంటారు. తెల్లవెంట్రుకలు పోవడానికి కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను తెలుసుకుందాం.
ఉసిరికాయ - హెన్నా : ఒక కప్పులో 3 టీస్పూన్ల ఉసిరికాయ పొడి, అరకప్పు హెన్నా పౌడర్, ఒక చెంచా కాఫీ పొడిని కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి ఒక గంటసేపు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో స్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు పోతాయి.

టీ హెయిర్ ప్యాక్ : ఒక కప్పు నీటిలో 2 స్పూన్ల టీ వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి ఆకులను మాత్రమే తీసుకుని జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల పాటు నానబెట్టి తల స్నానం చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
కరివేపాకు హెయిర్ మాస్క్ : గుప్పెడు కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత జుట్టుకు 3 స్పూన్ల కొబ్బరి నూనె రాసి ఒక గంట నానబెట్టి తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది.
హెన్నా పేస్ట్ :నాలుగు స్పూన్ల చెంచాల హెన్నా పొడిని ఒక కప్పులో కొద్దిగా నీళ్లతో కలిపి 8 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత 2 స్పూన్ల టీ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూను జామకాయ పొడి వేసి జుట్టుకు రాసుకుంటే ఊహించని ఫలితం వస్తుంది.
బంగాళాదుంప : 2 కప్పుల నీటితో 6 బంగాళాదుంప తొక్కలను ఉడకబెట్టాలి. తర్వాత అందులోని నీటిని వడకట్టి విడిగా నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలకు పట్టిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications