చలికాలం.. సీజనల్ వ్యాధులు ముసురుకునే సమయం: గట్టెక్కే చిట్కాలివే..
వర్షాకాలం ముగింపు దశలో ఉంది. అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపు కాదు. అటు కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి. అయిదు జిల్లాల్లో వర్షబీభత్సం నెలకొంది. 26 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పలువురు గల్లంతయ్యారు. నవంబర్ 4వ తేదీ దీపావళి. ఆ మరుసటి రోజే కార్తీకమాసం ఆరంభమౌతుంది. కార్తీకమాసం మొదలు కావడం అంటే.. శీతాకాలం ప్రారంభమైనట్టే. జనవరి వరకూ చలిగాలులు వీస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది.

చర్మ సంబంధ ఇబ్బందులు..
చలికాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు ముసురుకుంటుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మం పొడిబారడం కామన్‌గా కనిపిస్తుంటుంది. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమౌతుంటాయి. ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతింటుంటుంది. చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ వాడటం మంచిది. మార్కెట్‌లో అందుబాటులో ఉండే వాటిల్లో నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలలి. దీని వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది.

సీజనల్ ఫ్రూట్స్..
అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలను ఆహారంలో అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కోడిగుడ్లు, దానిమ్మ, జామపండ్లు, సపోటా, యాపిల్, సీతాఫలాలు వంటి సీజనల్ పండ్లను అధికంగా తీసుకోవాలి. అవన్నీ కూడా చర్మ సంరక్షణకి ఉపయోగపడతాయి. పడుకునే మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ ధరించడం వల్ల మడమల పగుళ్లను నివారించుకోవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చలికాలంలో చర్మ పొడిబారకుండా ఉండి ఇబ్బంది పెట్టదు. మార్కెట్లో దొరికే చాలా వస్తువులు చర్మ సంరక్షణానికి బాగా ఉపయోగపడతాయి.

విటమిన్లతో కూడిన ఆహారం..
ఆహారంలోకి కూరగాయలు, ఆకుకూరలు అధికంగా ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారదు. సమతుల్యాన్ని సాధిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్, బంగాళదుంప, చిలకడదుంప మొదలైనవి తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఉష్ణోగ్రతలను కాపాడతాయి. ఒమెగా 3, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం వంటివి అధిక మోతాదులో ఉన్న కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. వర్షాకాలంలో గొడుగులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. చలికాలంలో మంకీ క్యాప్స్, స్వెటర్లు, సాక్స్ ధరించడం అత్యవసరం. రాత్రిపూట చలికి తట్టుకునే దుస్తులను ధరించాల్సి ఉంటుంది.

పండ్లుకు ప్రాధాన్యత
ఉసిరి, బొప్పాయి, ఖర్జూర వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో వ్యాయామం తప్పనిసరి. ఎప్పట్లాగే తెల్లవారు జామున జాగింగ్ చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. ముక్కు దిబ్బడ వేధిస్తుంది. చలి తీవ్రత తగ్గిన తరువాత వాకింగ్ లేదా జాగింగ్ చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. స్నానానికి వాడే సబ్బులలో గ్లిజరిన్ మోతాదు అధికంగా ఉండటం చర్మానికి కొంత సంరక్షణను కలిగిస్తుంది. తగినంత నీరు తాగకపోతే మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలహీనపడుతుంది. చలికాలంలో నీళ్ళను తాగుతూ ఉండడం వలన ఉండే ఆరోగ్య సూత్రాలు ఏమిటో గమనించండి.












Click it and Unblock the Notifications