ఆశారాం బాపు కేసులో ట్విస్ట్: ఎవరో తెలియదన్న శిల్పి
జోధ్‌పూర్: ఆశారాం బాపు కేసులో ట్విస్ట్. ఆశారాం బాపు లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చి, కేసు నమోదయినప్పటి నుండి పరారీలో ఉన్న చింద్‌వారా గురుకుల్ ఆశ్రమ్ హాస్టల్ వార్డెన్ శిల్పి బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనకు ఆశారాం తెలియదని ఆమె పోలీసులకు చెప్పడం గమనార్హం. శిల్పి ఆంటిసిపెటరీ బెయిల్ కోసం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
శిల్పికి ఆశారాంతో లైంగిక సంబంధాలు ఉన్నట్లుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె మాత్రం తనకు ఆశారాం తెలియదని చెబుతున్నారు. ఆశారాంతో సంబంధం కలిగి ఉన్న శిల్పి... ఆయనకు అమ్మాయిలను, మహిళలను కూడా సరఫరా చేసే వారని ఆరోపణలు ఉన్నాయి.

16 ఏళ్ల బాలిక పైన లైంగిక వేధింపులు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆశారాం అరెస్టయ్యారు. అప్పటి నుండి శిల్పి పరారీలో ఉన్నారు. శిల్పి, మరో నిందితులు బాలికలను మభ్యపెట్టి ఆశారాం వద్దకు తీసుకు వెళ్లేవారు. ఆశారాం వారిని గదిలోకి తీసుకు వెళ్లి లైంగిక వేధింపులకు గురి చేసేవారట.
శిల్పికి ఆశారాంతో ఏళ్లుగా లైంగిక సంబంధముందని ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఆమెకు ఆశారం ఢిల్లీలో, అహ్మదాబాదులో రెండు ఫ్లాట్స్ కూడా బహుమతిగా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, తమ విచారణలో అలాంటి అంశాలు ఏవీ వెల్లడి కాలేదని జోధ్‌పూర్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఆశారాం బాపుకు నార్కో పరీక్షలు జరపాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications