లవ్ ఫెయిల్యూర్ సెలబ్రేషన్
ముగ్గురు కాలేజీ కుర్రాళ్లు రాత్రికి ఏం చేయాలో అన్న విషయం మీద తెగ ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు..
అందులో ఓ కుర్రాడికి ఓ అద్బుతమైన ఆలోచన బుర్రలో వెలిగింది.
"మనం ఓ రూపాయి నాణం పైకి ఎగరేద్దాం...బొమ్మ పడితే...సినిమా కి వెళ్దాం...బొరుసు పడితే పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం... ఒకవేళ అది అంచుమీద నిలబడితే మనం ఈ మాట మీద నిలబడి..శుబ్రంగా చదువుకుందాం" అన్నాడు.
ఆ ఆలోచన ముగ్గరికీ బాగా నచ్చింది..ముఖ్యంగా ముగ్గురూ తమకు చదువుపై గల శ్రద్దకు తమలో తామే అభినందించుకున్నారు.
------------
ఇద్దరు ప్రెండ్స్ పబ్ కి వెళ్లారు.
మొదటి వాడు అక్కడ ఆల్రెడీ ఉన్న మరో ప్రెండ్ ని చూసి వెళ్లి కొగిలించుకుని ..తనతో వచ్చిన వాడికి పరిచయం చేస్తూ... "మా చిన్నప్పుడు ప్రెండే..ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు" చెప్పాడు.
"ఏం?"
"లవ్ లో ఫెయిలయ్యాడులే.."
"ఇది మరీ విచిత్రంగా ఉంది...ఎవరైనా ఐదేళ్లు ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారా..?"












Click it and Unblock the Notifications