చేయని పనికి శిక్షిస్తారా..
క్లాస్ రూంలో ఓ విద్యార్థి అతి తెలివిని ప్రదర్శించాడు.
"టీచర్..! నేను చేయని పనికి నన్ను శిక్షిస్తారా..?" అని అడిగాడు విద్యార్థి.
"చేయనిదానికి ఎవరైనా ఎందుకు శిక్షిస్తారు, శిక్షించరు" చెప్పింది టీచర్/
"అయితే, టీచర్..! నేను హోం వర్క్ చేయలేదు" చల్లగా చెప్పాడు విద్యార్థి.
.... ...... .....
ఓ అమ్మాయి ఫోన్‌లో దాదాపు అరగంట పాటు మాట్లాడి ఆ తర్వాత ఆఫ్ చేసింది.
ఇది గమనించి.. "గంటల కొద్దీ మొబైల్‌లో మాట్లాడుతావు. ఇంతకీ ఎవరితో ఇంత సేపు ఇప్పుడు మాట్లాడింది?" అని అడిగాడు తండ్రి
"రాంగ్ నెంబర్.. డాడీ..!" అని చెప్పింది అమ్మాయి.












Click it and Unblock the Notifications