ఇప్పుడు కుక్క ప్రేమిస్తోంది....
యమలోకంలో.... చిత్ర గుప్తుడు...అక్కడున్న మగాళ్ల వంక చూసి చెప్పాడు..
"గయ్యాళి భార్యల వల్ల భాధలనుభవించిన వారంతా ఎడం వైపు వచ్చి నిలబడండి.. తమింట్లో భార్యలకు బానిసలుగా పనిచేసిన వారంతా కుడి వైపు నిలబడండి"
అంతా ఎడమవైపు వచ్చి నిలబడ్డారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం కుడివైపు నిలబడ్డాడు.
"నువ్వు అటెందుకు నిలబడ్డావు..నీ భార్య మీద అధికారం చెలాయించేవాడివా..." అడిగాడు ఆసక్తిగా చిత్ర గుప్తుడు..
"లేదు.. మరి నా భార్య ఇటు వైపు నిలబడమని చెప్పింది కనుక..." జవాబిచ్చాడు.
-------------------
చాలా కాలం తర్వాత కలిసిన ఇద్దరు ప్రెండ్స్ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు.
"పెళ్లయిన కొత్తలో నేను ఇంటికెళితే ప్రేమతో నా కోసం ఎదురుచూస్తూ నాకు స్వాగతం చెప్పేది నా బార్య.
ఆవిడ పెంచుకున్న కుక్క కొత్తవాడిగా భావించి మొరిగేది" చెప్పాడు బాలు తన ప్రెండ్ రాజాతో..
మరి ఇప్పుడు అడిగాడు రాజా
"కుక్క పరుగెత్తుకొచ్చి ప్రేమగా తోకాడిస్తుంది. మా ఆవిడ అరవడం నేర్చుకుంది" చెప్పాడు.












Click it and Unblock the Notifications