రెండు ఉంటే పూర్తిగా పాస్..
అప్పారావు: ఏమిట్రా.. రెండూ ఒకే రకం పుస్తకాలు కొన్నావు..
సుబ్బారావు: ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని అడ్వర్టయిజ్‌మెంట్ ఇచ్చారు. రెండు కొంటే పూర్తిగా ఎగ్జామ్స్ పాస్ కావచ్చు కదా..
...... ...... ....
తన గదిలోకి క్యాలెండర్ కావాలంటూ షాపులో అడిగాడు సుబ్బారావు
షాపు యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతి దాన్నీ తోసిపుచ్చుతూ... "ఇంకాస్తా మంచిదివ్వండి" అని అడిగ సాగాడు సుబ్బారావు.
షాపు యజమానికి విసుగు వచ్చి - "మంచిదంటే మీ ఉద్దేశ్యంలో ఎలా ఉండాలి?" అని అడిగాడు.
"అంటే... ఆఫీసుకు సెలవులు ఎక్కువ ఇచ్చేలా ఎర్రరంగు గుళ్లు ఎక్కువ ఉన్న క్యాలెండర్ కావాలి" అని వివరించాడు సుబ్బారావు.












Click it and Unblock the Notifications