ఈ రాశి వారికి ఏడేళ్ళ దరిద్రం పోతుంది.. 2025లో వీరే మహర్జాతకులన్న వేణు స్వామి!
ప్రముఖ జ్యోతిష్య పండితులు వేణు స్వామి 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలిపారు. వృషభ రాశి వారి జాతకాన్ని ఉద్దేశించి పేర్కొన్న ఆయన ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్ట సంవత్సరం అని తెలిపారు. ఇక వృషభ రాశి వారి 2025 సంవత్సరం జాతకం ఏ విధంగా ఉందో వేణు స్వామి జ్యోతిష్య అంచనా ద్వారా ప్రస్తుతం తెలుసుకుందాం.
వీరు పట్టిందల్లా బంగారం
వృషభ రాశి కృత్తికా 2,3,4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు, మృగశిర 1,2 పాదములలో పుట్టిన వారు వృషభ రాశి వారు. 2025 సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఆదాయం 11,వ్యయం 5 , రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురు బలం, శని బలం, రాహు కేతువుల బలం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది.

ఏడేళ్ళ కష్టాలకు చెక్
గత ఏడు సంవత్సరాల నుంచి శని కారణంగా ఇబ్బంది పడుతున్న వీరి కష్టాలు తొలగిపోతాయి. 2025 సంవత్సరం ఊహించని ధన లాభాలను ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. వృషభ రాశి జాతకుల కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది .ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వస్తాయి.
విద్యార్థులకు, ఉద్యోగులకు ఫలితాలు ఇలా
విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది .కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మార్కులు ఎక్కువగా వస్తాయి. కోరుకున్న కళాశాలలో సీట్లు దొరుకుతాయి. ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్లడానికి అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకు 2025 సంవత్సరం 100% లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు.
రైతులకు, కళాకారులకు ఎలా ఉంటుందంటే
సంఘంలో సమాజంలో మంచి పేరు వస్తుంది . అలాగే రైతులకు ఈ సంవత్సరము రెండు పంటల దిగుబడి పూర్తిస్థాయిలో ఉంటుంది. పూర్తి దిగుబడితో పాటు రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు చేస్తారు. ఇల్లు కానీ, భూములు కానీ కొనుగోలు చేస్తారు. రైతులకు సంబంధించి, కళాకారులకు సంబంధించి కచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అవార్డులు రివార్డులు వస్తాయి.
వృషభరాశి వారికి ఇబ్బందులు వస్తే ఇందువల్లే
2025 సంవత్సరం వృషభ రాశి జాతకులు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకుంటే తెచ్చుకునే అవకాశం ఉంది. తప్ప వృషభ రాశి జాతకులకు 2025 సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. ఇది వృషభరాశి జాతకుల 2025 సంవత్సరపు జ్యోతిష్య అంచనా అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి తెలిపారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications