2024 కొత్త సంవత్సరం మొత్తం ఈ రాశులదే

రాహు, కేతువులు అంటే చాలా మంది భయపడతారు. అవి చెడు ఫలితాలనే ఇస్తాయనేది ప్రజల్లో నమ్మకంగా మారిపోయింది. కానీ ఇవి కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి. వీటిని ఛాయా గ్రహాలు లేదంటే క్రూరమైన గ్రహాలుగా పిలుస్తుంటారు. ఇవి ఎప్పుడూ తిరోగమన దిశలోనే కదులుతుంటాయి. ఏడాదిన్నరకు ఒకసారి రాశులను మారుస్తుంటాయి. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న రాహువు 2024లో కూడా అదే రాశిలో ఉంటాడు. దీనివల్ల కొత్త సంవత్సరం ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

తులా రాశి : వీరికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. లగ్జరీగా జీవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్త ఏడాదిలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంతోపాటు అడ్డంకులన్నింటినీ తొలగిస్తారు. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది.

2024 Rahu Gochar effect on these Zodiac Sign people

వృషభ రాశి : కొత్త ఏడాది వీరికి బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరగడంతోపాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ధనాన్ని సాధ్యమైనంత ఎక్కువగానే సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాన్ని సాధిస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది.

కుంభ రాశి : ఊహించని మొత్తంలో వీరికి ధనలాభం ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కెరీర్ బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలున్నాయి. నలుగురికి ఆదర్శంగా మీ జీవితం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+