2024 ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ముఖ్య గమనిక :- మన సనాతన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజు పంచాంగ శ్రవణం, గ్రహగతుల ఆధారంగా దేశ కాలమాన పరిస్థితులపై సరైన ఫలితాలు తెలుస్తాయి. ఇవి కేవలం ఆంగ్లమాన సంవత్సర ప్రారంభం కొరకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతకపరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం, అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

2024 సంవత్సరంలో విశేషముగా ఉన్నది. పనులందు ఆటంకములు కలిగినను సకాలంలో పనులను పూర్తిచేస్తారు. కుటుంబ, ఆర్థిక విషయాలు ఉత్సాహంగా ఉంటాయి. సోదరవర్గము నుండి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. గృహ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. శత్రు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాల వలన ధన లాభ సూచనలు ఉన్నవి.

స్థిరస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి చేయువృత్తి, ఉద్యోగము నందు అధికారుల మన్ననలు పొంది ఉన్నత పదవులు పొందుతారు క్రయవిక్రయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వ్యవసాయదారులకు రెండు పంటలు కలసివస్తాయి. విద్యార్థులకు తాము ఆశించిన పోటీపరీక్షలయందు విజయాన్ని సాధిస్తారు. కొన్ని రంగాల వారికి నూతన పెట్టుబడులు కలిసి వచ్చి విశేషమైన లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనటు వంటి ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

2024 సంవత్సరంలో మిశ్రమంగా ఉన్నది. వ్యాపారములు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక విషయాలు కొంత చికాకు కల్గించినను సంవత్సరాంతమున పూర్తి అవుతాయి. సోదరుల వలన విశేష సహకారము అంది గృహంలో వివాహాది శుభకార్యాలను ఆచరిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి వలన కొంత విబేధాలు తప్పవు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చేయు వృత్తి, ఉద్యోగమునందు సహోద్యోగుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. పుణ్యకార్యాలతో కొంత ధనాన్ని వెచ్చిస్తారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి. విద్యార్ధులు పరీక్షలయందు ఉత్తీర్ణత సాదిస్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభం చేస్తారు.

కొన్ని రంగము వారికి అనుకూలంగా యున్నది. ఈ రాశి స్త్రీలకు కుటుంబమున, సంఘము నందు కీర్తి ప్రతిష్ఠలు ఏర్పడతాయి. శుభకార్య నిర్వహణలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

2024 సంవత్సరంలో శ్రమచేత ఫలితాన్ని సాధించవలసి వచ్చును. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవుట మంచిది. కుటుంబమున మాట విలువ తగ్గుతుంది. ఆర్థికవిషయాలు చికాకులు కల్గిస్తాయి. సోదర, బంధువర్గము వారి నుండి విబేధాలు తప్పవు. కోర్టు, శత్రు సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి వలన కలసివస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో ఆచరించుట మేలు. ఆకస్మిక దూరప్రాంత పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు.

గతంలో రావలసిన పిత్రార్జితం ఈ సంవత్సరామున చేతికందును. చేయువృత్తి, ఉద్యోగమునందు సమస్యలు ఉన్నను సామాన్యముగా ముందుకు సాగును. వ్యవసాయదారులకు పంటలుపండినను ఆదాయము చేతికి లభించుట కష్టము. విద్యార్థులకు పరీక్షలయందు ఉతీర్ణత సాధిస్తారు. రాజకీయ నాయకులకు సామాన్యంగా ఉండును. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యభంగమగును, జాగ్రత్తగా ఉండటం మంచిది. రాహు కేతు పూజ చేయించాలి. నిత్యం సూర్య నమస్కారములు చేసుకోవాలి. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

2024 సంవత్సరంలో కొంత గడ్డుకాలముగా ఉన్నది. అనుకున్న పనులు సమయానికి పూర్తికాక నిరాశ తప్పదు. కుటుంబ ఆర్థిక విషయాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయవడం వలన చికాకులు తప్పవు. గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి. సోదరవర్గము నుండి కొంత సహకారము లభిస్తుంది. సంతాన వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు వాయిదా పడుతాయి. శత్రు, సమస్యలు ఇతరుల సహకారంతో పరిష్కరించుకుంటారు.

ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగమునందు శ్రమ ఎక్కువగా ఉన్నను ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు. విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కొన్ని రంగము వారికి అనుకూలంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు. శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం. రాహుకేతూ పూజ చేయించాలి మీరు ప్రస్తుతం అష్టమ శని ప్రభావంలో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

2024 సంవత్సరంలో మిశ్రమంగా ఉన్నది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలు కొంత చికాకులు గురిచేస్తాయి. సోదర, బంధు వర్గము నుండి సహాయ సహకారము అందుతుంది. ఇంటా బయట గౌరవము పెరుగుతుంది. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. శత్రు, కోర్టు వ్యవహారాలు ఇతరుల సహకారంతో సులువుగా పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వాహన ప్రయాణ విషయం లో జాగ్రత్త అవసరం.

వృత్తి, ఉద్యోగమునందు ఒత్తిడి పెరిగిన అధికారుల అనుగ్రహంతో పూర్తిచేస్తారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలసివచ్చి ఆదాయము పెరుగుతుంది. విద్యార్థులకు నూతన విద్య అవకాశములు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవీయోగము. కొన్ని రంగములు వారికి కొంత సామాన్యంగా యున్నది. ఈ రాశి స్త్రీలకు నూతన మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయించాలి. ప్రస్తుతం మీరు శని భగవానుని సప్తమ వీక్షణలో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

2024 సంవత్సరంలో మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్య విషయమలో తగిన శ్రద్ధను తీసుకోవడం మంచిది. పనులందు కష్టము తప్ప ఫలితం కనిపించదు. శిరో సంభంద అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ, ఆర్థిక విషయాలు కొంత సామాన్యం. బంధువర్గము నుండి సహాయ సహకారము లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన పరంగా ధన వ్యయం తప్పదు. భాగస్వామ్య వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారములలో తొందరపాటు పని చేయ్యదు. వృత్తి, ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలముగా ఉన్నది.

విద్యార్థులు మరింత కష్టపడవలసి వచ్చును. రాజకీయ నాయకులకు గందరగోళ పరిస్థితులు తప్పవు. ఈ రాశి స్త్రీలు, కుటుంబమున గౌరవము తగ్గును. అకారణ కలహా సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

2024 సంవత్సరంలో అనుకూలకాలముగా ఉన్నది. వ్యాపారమున నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదర, బంధు వర్గము వారి నుండి సంపూర్ణ సహకారము అందుతుంది. గృహమున శుభకార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కోర్టు, వ్యవహారాలు సానుకూలముగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలసివస్తాయి.

భార్య తో కొన్ని విషయాలలో మాట పట్టింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడి తప్పదు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలసి వచ్చి ఆదాయము చేతికందును. విద్యార్థులకు ఆశించిన ఫలితాలను సాధించుటలో పోటీపడతారు. కొన్ని రంగముల వారికి అనుకూలంగా యున్నది. రాజకీయ నాయకులకు ఇతరుల వలన సమస్యలు తప్పవు. ఈ రాశి స్త్రీలకు నూతన కార్యక్రమములు ప్రారంభిస్తారు. ఇంట బయట విలువ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

2024 సంవత్సరంలో సామాన్యముగా ఉన్నది. కుటుంబ, ఆర్థిక విషయాలు నిరుత్సహపరుస్తాయి. సోదర, బంధు వర్గమువారి నుండి వ్యతిరేకత పెరుగుతుంది. గృహమున శుభకార్యములు శ్రమచేత పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయ విషయంలో నష్టములు తప్పవు. శుభకార్యములు వాయిదా వేసుకొనుట మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నిరాశకు గురిచేస్తాయి. వృత్తి, ఉద్యోగమునందు అభివృద్ధి లేకున్నను అందరి మన్ననలతో ముందుకు సాగుతారు. వ్యవసాయదారులకు కొంత సామాన్యంగా ఉన్నది. విద్యార్థులకు కోరుకున్న విద్యను పొందుటకు అధిక శ్రమ పడవలసి వచ్చును. అన్ని రంగముల వారికి సామాన్యం.

ధన వ్యవహారములలో మధ్య వర్తిత్వం వలన సమస్యలు తప్పవు. ఈ రాశి స్త్రీలకు ఏపని చేసినను కార్య ఆటంకములు తప్పవు. ధన వ్యవహారములందు శ్రద్ద వహించాలి. గోచారరిత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

2024 సంవత్సరంలో విశేషముగా ఉన్నది. అనుకున్న సమయానికి పనులు పూర్తి అగును. విదేశీ ప్రయాణములు లాభిస్తాయి. కోర్టు వ్యవహారములందు విజయం సాధిస్తారు. శత్రువులు సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. సోదరుల నుండి కొన్ని వ్యవహారాలలో నిరాశ తప్పదు. నూతన గృహాన్ని కొనుగోలుచేస్తారు. వృత్తి, ఉద్యోగము నందు సమస్యలు ఉన్న ముందుకు సాగుతారు. దూర ప్రాంత బంధు వర్గం నుండి శుభవర్తమానాలు అందుతాయి.

సంతాన వివాహ ప్రయత్నాలు సఫలమౌతాయి. వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగముల వారికి అనుకూలముగా ఉండును. స్త్రీలకు ఆదాయం మెరుగుపడును. అనారోగ్య సమస్యలు కొంత బాదించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

2024 సంవత్సరంలో సానుకూలముగా ఉన్నది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారములందు చికాకు కలిగిస్తాయి. ధన వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయాలలో సానుకూలముగా ముందుకు సాగుతారు. సోదర, బంధు వర్గము వారి నుండి కొంత వ్యతిరేకత కల్గుతుంది.

శత్రు సంబంధమైన సమస్యలు తప్పవు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి. వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు పొందుతారు. కొన్ని రంగముల వారికీ అనూలముగా యున్నది. ఈ రాశి స్త్రీలకు విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. అధికారుల సహాయంతో చాలా వరకు పనులు పూర్తవుతాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

2024 సంవత్సరంలో కొంత సామాన్యంగా ఉన్నను అవసరానికి సరిపడ సమయానికి పనిని పూర్తిచేసుకుంటారు. శారీరకముగా స్వల్ప అనారోగ్యములు తప్పవు. కుటుంబ, ఆర్ధిక విషయాలు ఋణ ఒత్తిడి అధికమౌతుంది. సోదర, బంధువర్గము నుండి వ్యతిరేకత. శుభకార్య ఆటంకములు తప్పవు. శత్రు భయం పెరుగును. విదేశీ వ్యవహారాలు సంవత్సరాంతమున పూర్తి అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగుటం మంచిది.

వృత్తి, ఉద్యోగమునందు సామాన్యముగా ఉన్నను పేరును సంపాదిస్తారు. క్రయవిక్రయాలలో చాలా శ్రద్ద అవసరం వ్యవసాయదారులకు క్రొత్త పంటలు లాభించి ఆదాయము చేకూరుతుంది. విద్యార్ధులకు ఉన్నత విద్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చుచేయవలసి వస్తుంది. కొన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నవి. ఈ రాశి స్త్రీలకు సామాన్యంగా ఉన్నది ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. ప్రభుత్వ సహాయ సహకారములు అందుతాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

2024 సంవత్సరంలో సామాన్యముగా ఉన్నది. స్థిరమైన ఆలోచనలు లేక నిలకడ లోపిస్తుంది. కుటుంబ, ఆర్థిక విషయాలు చికాకులు కల్గించినను నిదానముగా ముందుకు సాగుతారు. సోదరవర్గము నుండి ఆదాయమార్గాలు పెరుగుతాయి. బంధువుల నుండి వ్యతిరేకత తప్పదు. సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు అనూకులత తక్కువ. జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యకార్యములకు, విశేషంగా ధన వ్యయం చేస్తారు. గతంలో నిలచిన ఆస్థి వ్యవహారాలు సంవత్సరాంతమున పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగమునందు అభివృద్ధి నత్త నడకన సాగును. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలముగా ఉన్నది.

విద్యార్థులకు నూతన ప్రయత్నములచే విద్యా కార్యములను పూర్తి అగును. ఋణాలను ఎక్కువగా చేయవలసి రావచ్చు. కొన్ని రంగముల వారికి పని ఒత్తిడి పెరుగును. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+