2025 మేషరాశి వారి జాతకం.. పెనుమార్పులు సంభవమన్న వేణుస్వామి!
2025 మేషరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పారు. మేషరాశి జాతకులకు ఈ 2025లో సానుకూల అంశాలు ఏంటి? ప్రతికూల అంశాలు ఏంటి ? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. అశ్విని 1,2,3,4పాదాలు, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తికా 1 పాదము వారు మేషరాశి జాతకులు. 2025 సంవత్సరం మేష రాశికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యం 5, అవమానం 7.
మేషరాశి జాతకులపై ఏలినాటి శని ప్రభావం
ఈ సంవత్సరం ఏలినాటి శని కారణంగా 24 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు రెండవసారి ఏలినాటి శని వస్తుంది. రెండవసారి ఏలినాటి శని చాలా పవర్ఫుల్. 1995 వ సంవత్సరము నుండి 2002 వరకు మేష రాశి వాళ్లు వాళ్ళ జీవితంలో కష్టాలు అనుభవించారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ కష్టాలు 2025 వ సంవత్సరంలో మేషరాశి జాతకులు అనుభవిస్తారు.

తీవ్ర ఇబ్బందులు
పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు, యాక్సిడెంట్లు, మరీ ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ టాక్స్ దాడులు లేదా కమర్షియల్ టాక్స్, సేల్స్ టాక్స్ లాంటి దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్యాక్స్ ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. టాక్స్ ల విషయంలో అప్ టు డేట్ గా డబ్బులు కట్టండి. గవర్నమెంట్ తో గొడవలు పెట్టుకోకండి.
ఆస్తులు కొంటే జాగ్రత్త
అలాగే కొత్త ఇల్లు కొనుగోలు చేసే వాళ్ళు భూమి కొనేవాళ్లు ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా ఆలోచించి పేపర్స్ జాగ్రత్తగా చెక్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇల్లు గాని, స్థలం గాని కొనుక్కోండి లేదంటే లిటిగేషన్ ప్రాపర్టీలోకి వెళ్ళే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్లకు ఏసీబీ, సిబిఐ, ఈడి లాంటి సమస్యలు మిమ్మల్ని కష్టపెట్టే అవకాశం ఉంది
వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు
ఇక వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు, బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఇక మేషరాశి విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం విదేశాల్లో చదువులకు, ఉద్యోగాలకు వెళ్ళే వారి కలలు ఫలిస్తాయి. అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలు ఉన్నాయి.ఉద్యోగులకు మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ప్రమోషన్లు ఉన్నాయి. మీ పై అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.
రైతులకు కళాకారులకు 2025 అనుకూలం
రైతులకు సంబంధించి ఈ సంవత్సరం రెండు పంటలు పండి దిగుబడి, రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి జాతకుల ఇళ్ళలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సినిమా రంగం వారికి ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. టీవీ రంగంలో వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా సంగీత ప్రపంచంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది .కళాకారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది.
స్త్రీలకు ఇలాంటి ఫలితం
ఈ రాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి, బోటిక్ గాని, సెలూన్ గాని ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే స్త్రీలకు రూపాయికి వంద రూపాయలు సంపాదించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ రాశి జాతకులకు మెరుగైన ఫలితాల కోసం నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేస్తే కూడా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన 2025 మేషరాశి జాతకం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications