2025లో కర్కాటక రాశి వారికి విపరీత రాజయోగం.. కానీ జాగ్రత్త అంటున్న వేణుస్వామి

కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు తమ జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన ప్రధానంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి ద్వాదశరాశుల వారి రాశి ఫలాలను వివరించారు. ప్రస్తుత మనం వేణు స్వామి జ్యోతిష్య అంచనా ప్రకారం కర్కాటక రాశి వారి జీవితం 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారి 2025 జాతకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి ఒకటి,రెండు, మూడు, నాలుగు పాదాలు ,ఆశ్లేష ఒకటి, రెండు ,మూడు, నాలుగు పాదాల వారు కర్కాటక రాశికి చెందినవారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు ఆదాయం 8 వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం గురువు కర్కాటక రాశిలో వ్యయస్థానంలోకి రాబోతున్నప్పటికీ కూడా భాగ్య స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల సమస్యలు ఉండవు .

2025 cancer Horoscope Venu Swamy prediction vipreet rajyoga for this zodiac sign in 2025

కర్కాటక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త
ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు కాళ్లు చేతులు విరిగే అవకాశం ఉంది. సర్జరీలు జరిగే అవకాశం ఉన్న కారణంగా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నీళ్లలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వేణు స్వామి తెలిపారు . కర్కాటక రాశి జాతకులకు అలాగే గొంతు నుండి బొడ్డు వరకు ఏవైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉందన్నారు.

వీరికి అనుకూలంగా కొత్త సంవత్సరం
మిగతా అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా 2025 సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు కలిసొస్తుందని వేణు స్వామి వెల్లడించారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని, వారి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది సరైన సమయం అని తెలిపారు. విదేశాలలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ ముగ్గురికి అనుకూలంగా 2025
వ్యాపారం నిర్వహిద్దాం అనుకునేవాళ్ళకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించాలంటే అనుకూలమైన పరిస్థితి ఉంది. కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉండబోతోంది .మరి ముఖ్యంగా విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహించడం అవార్డు రివార్డులు పొందడం లాంటివి ఈ సంవత్సరం జరుగుతాయి. 2025 సంవత్సరంలో డాక్టర్లు, యాక్టర్లు అలాగే లాయర్లు ఈ ముగ్గురికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు కనిపించబోతున్నాయి.

2025 cancer Horoscope Venu Swamy prediction vipreet rajyoga for this zodiac sign in 2025

రైతులకు ఇలా ఉంటుంది
అయితే రాజకీయ రంగానికి చెందినవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఎరుపు రంగుకు సంబంధించి పంటలు ఎవరైతే సాగు చేస్తారో వారికి అనుకూలంగా ఉంటుంది. రెండు పంటలకు సంబంధించి దిగుబడులు బాగుంటాయి. ప్రభుత్వం వైపు నుంచి కూడా రైతులకు మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి వారికి విపరీత రాజయోగం
2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్న ప్రధానమైన సమస్య గురువు వ్యయంలో ఉండడం. దీనివల్ల చిన్నచిన్న ఇబ్బందులు మినహాయించి మిగతా అంతా కర్కాటక రాశి జాతకులకు సజావుగా సాగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే కర్కాటక రాశి జాతకులు విపరీతమైన రాజయోగంతో అన్ని రంగాలలోనూ పురోగతిని సాధిస్తారు.

ఇబ్బందుల నుండి విముక్తికి ఇలా పరిహారం
ఇక ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందుల నుండి ఉపశమనం పొందాలంటే ప్రతి గురువారం రోజు లెమన్ ఎల్లో కలర్ బట్టలను ధరించాలని గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన చేయించుకుంటే సరిపోతుంది అని చెప్పారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+