2025లో ఈ రాశులది తిరుగులేని జాతకమని చెప్పిన జ్యోతిష్యుడు నీరజ్ ధనఖేర్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో కీలకమైన అంగారకుడు ఈనెల 7వ తేదీ నుంచి తిరోగమన దిశలో వృషభరాశిలో సంచారం చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఇక్కడే సంచారం చేస్తున్నాడు. ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంటాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన తిరిగి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయని ప్రముఖ్య జ్యోతిష్య పండితులు నీరజ్ ధనఖేర్ చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం.

మేషం
సంపాదించిన డబ్బును దీర్ఘకాలిక పెట్టుబడులపై పెట్టుబడి పెట్టాలి. స్టాక్ మార్కెట్ లాంటివి వద్దు. రియల్ ఎస్టేట్ లాంటివాటిల్లో పెట్టాలి. ఇంటిని కొనుగోలు చేయడానికి, బండిని కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఇంట్లో పెద్దల సలహా తీసుకోవాలి.

2025 horo socope six zodiac signs will become millionaires and get new house

వృషభం
ప్రధానమైన విషయాలను ఎదుటివారితో పంచుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. మెసేజ్ లు పంపించేటప్పుడు కూడా ఇలాగే ఉండండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పట్టువిడుపులు పనికిరావు. మొండిపట్టును విడనాడాలి.

మిథునం
మీ తప్పు ఒప్పులను గుర్తించి సరిచేసుకోవాలి. దీర్థకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలపై దృష్టిసారించాలి. మీ ప్రాధాన్యత ఏమిటి అనే విషయంపై దృష్టిపెట్టండి. ఆస్తులకు సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి.

కర్కాటకం
కెరీర్ లో లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిదిశగా పయనించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దీనివల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆత్మగౌరవానికి భంగంవాటిల్లే ఏ పనీ చేయరాదు. కొన్ని పనులు చికాకుగా అనిపిస్తాయికానీ ఓర్పుగా ఉండండి.

సింహ రాశి
ఏ పనిచేస్తున్నా హడావిడి చేసే అలవాటును మానుకోండి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. ప్రస్తుతం చేస్తున్న పనులను పూర్తిచేయడానికి ప్రయత్నించండి. వాటినే మరింత అభివృద్ధి చేయడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా? అని ఆలోచించండి.

కన్య
ఈ సమయంలో మీ స్నేహానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదు. తర్వాత మీకు మంచే జరుగుతుంది. ప్రస్తుతం సమాజంలో మీకున్న పరిచయాలు మీ అభివృద్ధికి తోడ్పడతాయి. ఇవన్నీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు దారి మళ్లించాలి. సమర్థవంతంగా పనిచేయండి. అన్ని విధాలుగా కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+