జులై నెలలో ఈ రాశులవారికి కష్టాల సునామీ తప్పదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి మిధున రాశిలోకి మే 14వ తేదీన ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశించింది. ప్రస్తుతం మిధున రాశి లోనే సంచారాన్ని సాగిస్తుంది. అటువంటి బృహస్పతి మిధున రాశిలో అస్తమించి మళ్లీ ఉదయిస్తుంది. మిధున రాశిలో బృహస్పతి ఉదయం జూలై 14 వ తేదీన జరగబోతుంది. జూలై 14 వ తేదీన బృహస్పతి ఉదయం మిధున రాశిలో జరగడం చాలా అరుదైన యాదృచ్చికం.
జులైలో వీరికి కష్టాలు
ఇది దాదాపు 500 ఏళ్ల తర్వాత జరుగుతున్న యాదృచ్చికం. ఇక ఇదే సమయంలో జూలై 13వ తేదీన శని తిరోగమన సంచారం చేయబోతోంది. మీనరాశిలో శని తిరోగమన సంచారం కూడా అరుదైన యాదృచ్చికం. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంటే, మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి ఉదయం, శని తిరోగమనం కారణంగా దుష్ప్రభావాలను ఎదుర్కొనే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
జూలై మాసంలో చోటు చేసుకునే వివిధ పరిణామాల కారణంగా వృషభ రాశి జాతకులకు కష్టాలు రాబోతున్నాయి. ఈ సమయం వీరికి ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఖర్చులు ఊహించని విధంగా పెరిగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు.
మిధున రాశి
మిధున రాశి వారికి కూడా ఈ సమయంలో చెడు ప్రభావం ఉంటుంది. జూలై నెల వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొత్త పనులు ఏవి ప్రారంభించకపోతేనే మంచిది. ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయం మిధున రాశి వారికి కష్టకాలం.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఇబ్బందులు వస్తాయి. వర్తక, వ్యాపారాల పరంగాను అనేక సమస్యలను ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఆర్థికపరమైన నష్టాలు వస్తాయి. అనవసరమైన కష్టాలతో కర్కాటక రాశి జాతకులు ఇబ్బంది పడతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో అనేక ఇబ్బందులు వస్తాయి. జూలై నెలలో వీరు ఖర్చులను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాల పరంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది వృశ్చిక రాశి వారికి కష్ట కాలంగా చెప్పవచ్చు.
మకర రాశి
మకర రాశి జాతకులకు ఈ మాసం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. వీరికి పనిలో ప్రతికూలతలు వస్తాయి. ఏ పని చేసిన వీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఊహించని విధంగా గొడవలోకి వెళ్లే అవకాశం ఉంది. జీవితం అశాంతితో కూడుకొని ఉంటుంది. కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications