వాస్తు దోషాలన్నింటినీ తొలగించే తాబేలు ఉంగరం!

మనలో చాలామంది జ్యోతిష్య పండితులు చెప్పారని రకరకాల ఉంగరాలను చేతివేళ్లకు ధరిస్తుంటారు. ఒకరు ముత్యం పెడితే, మరొకరు వారి రాశి ప్రకారం పగడం.. వజ్రం, బంగారం.. ఇలా పలురకాల ఉంగరాలు పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థికంగా కలిసివస్తుంది. తాజాగా ట్రెండ్ మారింది. కొంతకాలం నుంచి చేతివేలికి తాబేలు ఉంగరం ధరిస్తున్నారు. ఇది ధరిస్తే కోటీశ్వరులు కావడం ఖాయమనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. దశావతారాల్లో కూర్మావతారం ప్రసిద్ధి చెందింది. మహాలక్ష్మికి తాబేలు అంటే ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి.

వెండితో చేసినదే ఉత్తమం
అయితే తాబేలు ఉంగరం ఎవరు ధరించాలి? బంగారంతో చేసినదా? వెండితో చేసినదా, రాగితో చేసినదాన్ని ధరించాలా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతుంటాయి. అయితే బంగారంకన్నా వెండితో చేసిన తాబేలు ఉంగరం చాలా మంచిదని, బాగా కలిసివస్తుందని పండితులు చెబుతున్నారు. ఇతర లోహాలతో చేసినవి వద్దంటున్నారు. సాధారణంగా బంగారంతో చేసిన తాబేలు ఉంగరం ధరించాలా.. లేకపోతే వెండితో చేసిన తాబేలు ఉంగరం ధరించాలనేది చాలా మందిలో మదిలో మెదిలే డౌటు. బంగారంతో కంటే వెండితో చేసిన తాబేలు ఉంగరం శ్రేష్ఠమని శాస్త్రం చెబుతుంది. ఇక ఇతర లోహాలతో చేసిన తాబేలు ఉంగరం అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుందట.

A turtle ring that removes all Vastu defects

కుడిచేతికి మాత్రమే ధరించాలి
తాబేలు ఉంగరం అనేది వాస్తు దోషాలను తొలగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సంపదను, శ్రేయస్సును, అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అయి పనులన్నీ సంపూర్ణంగా పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటారు. కుడిచేతి చూపుడు వేలుకు లేదంటే మధ్య వేలుకు తాబేలు ఉంగరాన్ని ధరించాలి. ఎడమ చేతికి అసలు ధరించకూడదు. కష్టాలు తొలగిపోవడంతో అదృష్టం కలిసివచ్చి ఇంట్లోకి ధన ప్రవాహం ఉంటుంది. తాబేలు తల ఉంగరం పెట్టుకున్న వ్యక్తివైపు ఉండాలి. అన్ని రాశులవారు దీన్ని శుక్రవారం ఉదయం ధరించవచ్చని నిపుణులు, పండితులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+