వాస్తు ప్రకారం పూజగదిలో పొరపాటున కూడా ఈ 5 వస్తువులు ఉంచొద్దు!
వాస్తు ప్రకారం ఇంటికి పూజ గది అనేది ఆత్మ లాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉండకూడదు. ఉంటే వాటిని వెంటనే తీసేయాలి. మనకు అత్యంత ప్రశాంతతను కలిగించే పూజ గదికి వాస్తు నియమాలు పాటించాలి. గది మొత్తం సానుకూల శక్తి ఉండేలా చేయాలంటే కొన్నింటిని పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
దేవుడికి తాజా పూలే సమర్పించాలి
కొంతమంది ఒకరోజు ముందే కోసి ఉంచుకుంటారు
కానీ వాటిని దేవుడి దగ్గర పెట్టకూడదు
దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది

పగిలిపోయిన విగ్రహాలను పెట్టకూడదు
దీనివల్ల ప్రతికూల శక్తి ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తుంది
ఏదైనా విగ్రహం పగిలితే వెంటనే కొత్తది ప్రతిష్టించాలి.
పూజగదిలో చెప్పులు, బూట్లు, సాక్సుల్లాంటివి ఉండకూడదు
కొంతమంది చెప్పుల స్టాండ్ ను పెడతారు. దాన్ని తీసేయాలి
తిరిగి కనిపించని చోట పెట్టాలి
అపరిశుభ్రంగా ఉండే ఏ వస్తువునూ పూజగదిలో పెట్టకూడదు
ఖాళీ ఉందికదా అని చాలామంది ఆ తప్పే చేస్తుంటారు
అపవిత్రమైన వస్తువులు ఉండటంవల్ల ప్రతికూలశక్తి ప్రవేశిస్తుంది
పూజగదికి ఉన్న పవిత్రమైన శక్తిని పాడుచేస్తుంది
కొంతమంది మరణించిన తమ పెద్దల చిత్రపటాలను పూజగదిలో ఉంచుకుంటారు
వీటిని అక్కడ పెట్టకూడదు. వేరే గదిలో పెట్టుకోవాలి
వాస్తు ప్రకారం పూజగదిలో ఇవి ఉండకూడదు.












Click it and Unblock the Notifications