వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఇంటికి బంగారం బహుదూరం

బంగారం ధరలు రోజురోజుకు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నారుగా. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కుంటే సరిపోయేదిగా అంటూ ఎంతోమంది మహిళలతోపాటు పురుషులు కూడా బాధపడుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్నిఇళ్లల్లో బంగారం నిలవదు. దానికి కారణం ఏమిటంటే.. మహిళలు శుభ్రంగా ఉండకపోవడం, బంగారం ఉండే దిక్కును తప్పుడు దిక్కులో పెట్టడం, మహిళలకు ఇంట్లో గౌరవం లేకపోవడం, బంగారాన్ని తనఖా పెట్టడంలాంటి కారణాలవల్ల కొన్ని ఇళ్లకు బంగారం దూరమవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గోల్డ్ మాత్రం ఉండదు. దీనికి వాస్తు కొన్ని కారణాను చెబుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

లక్ష్మీదేవి ప్రసాదమే బంగారం.
ఇంట్లో సమృద్ధిగా ఉంటే ఆ ఇంట్లో శ్రేయస్సు, శాంతి వెల్లివిరుస్తాయి.
ఇల్లు శుభ్రంగా ఉండకపోయినా,
దుమ్ము, ధూళితో నిండిపోయినా సంపద, బంగారం నిలవ్వు.
ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.

According to Vastu Shastra gold is far away from this house

బంగారాన్ని ఉత్తర దిశలో లేదంటే వాయువ్య దిశలో నిల్వ చేయాలి.
దక్షిణం, ఆగ్నేయంలో పెడితే ఆస్తి తగ్గుతుంది.

బంగారాన్ని తనఖా పెట్టకూడదు. వాస్తు ప్రకారం ఇది అత్యంత అశుభకరమైన చర్య.
దీనివల్ల సంపదను కోల్పోతారు.
ధనలాభం తగ్గి, లక్ష్మీదేవి కటాక్షానికి దూరమవుతారు.

వీటిని ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ఇవి ఆధ్యాత్మికంగా మనకు ఉన్న ఆధారాలు.
అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి..
ఇల్లు శుభ్రంగా ఉండాలి.. గౌరవం దక్కించుకోవాలి.. సానుకూల శక్తులుండాలి.. ఆర్థిక నియంత్రణ పాటించాలి.
ఇవి పాటిస్తే బంగారం కచ్చితంగా నిలబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+