వాస్తు ప్రకారం బాత్‌రూంలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి ఉన్నాయేమో చూసుకోండి!
వాస్తు ప్రకారం మనం ఇంటిని నిర్మించుకుంటాం. అయినప్పటికీ ప్రతికూల శక్తికి స్థానం మాత్రం బాత్‌రూం. ఎక్కువ ప్రతికూలతను ఈ బాత్‌రూం ఆకర్షిస్తుంది. అందుకే దీనికి కూడా ఉన్న నియమాలను కచ్చితంగా పాటిస్తుండాలి. అన్ని గదులకు వాస్తు నియమాలు ఉన్నట్లుగానే స్నానాలు చేసే గదికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించకపోతే ప్రశాంతత కోల్పోతారు. కుటుంబంలో శాంతి ఉండదు. వాస్తు నిపుణులు చెబుతున్నదాని ప్రకారం కొన్ని వస్తువులు స్నానాల గదిలో ఉండకూడదు. ఉంటే వెంటనే తొలగించాలి. లేదంటే కుటుంబంలో అశాంతి రేకెత్తుతుంది. వాస్తు దోషం రాకుండా చూసుకోవాలంటే అవేంటో తెలుసుకుందాం.
స్నానాల గదిలో చాలామంది తడిబట్టలను అలాగే వదిలేసి వస్తుంటారు. కానీ అలా వదిలేయడంవల్ల వాస్తు దోషాలు తలెత్తుతాయి. దుస్తులను వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేదంటే వాటిని ఆరబెట్టుకోవాలి. చాలామంది స్నానాల గదిలో బకెట్ ను అలాగే వదిలేస్తుంటారు. బకెట్ ఖాళీగా ఉండకూడదు. దీనివల్ల దురదృష్టం వెంటాడుతుంది. బకెట్ ఎప్పుడు నీటితో నిండుగా ఉండాలి.దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

స్నానాల గదిలో విరిగిన అద్దాలు ఉండకూడదు. విరిగిన అద్దం ఇంటి వాస్తు శక్తిని ప్రభావితం చేస్తుంది.ఆర్థిక సమస్యలు రావడానికి కారణమవుతుంది. అద్దం విరిగిపోయి ఉంటే వెంటనే దాన్ని బయట పారేయండి.పాత చెప్పులను, తెగిపోయిన చెప్పులను పొరపాటున కూడా బాత్ రూంలో పెట్టొద్దు. ప్రతికూల శక్తిని ఆకర్షించే శక్తి వీటికి ఉంటుంది.అలాగే స్నానాల గది చుట్టూ మొక్కలు ఉండకూడదు.దీనివల్ల కుటుంబానికి వాస్తు దోషం కలుగుతుంది.
వీటన్నింటిని పాటించడంవల్ల అన్నిరకాల సమస్యలు పరిష్కారమవుతాయి.ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమవుతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications