వాస్తు ప్రకారం పర్సులో ఈ వస్తువులు ఉండకూడదు
ప్రతి ఒక్కరూ కచ్చితంగా పర్సును వాడుతుంటారు. అందులో రకరకాల వస్తువులను ఉంచుతారు. మహిళలు, పురుషులు అందరూ పర్సులను ఉపయోగిస్తుండటంతో వాస్తు ప్రకారం వాటిల్లో ఏ వస్తువులు ఉండాలి? ఏ వస్తువులు ఉండకూడదు అనే విషయాలను తెలుసుకుందాం. పర్సులో ఉండకూడని వస్తువులుంటే వెంటనే తొలగించాలని, లేదంటే నష్టాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడటంతోపాటు డబ్బు నష్టం కలుగుతుంటుందని, వీటిని నివారించాలంటే ఈ సూచనలు పాటించాలంటున్నారు. మన పర్సులో కొన్ని వస్తువులుంటే అవి శుభాలను కలిగిస్తాయి. అయితే తొలగించాల్సినవేంటో చూద్దాం.
అనవసరమైన తాళాలు
పర్సులో అనవసరమైన తాళాలను ఉంచితే రాహు కేతువుల ప్రభావం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చి డబ్బు మంచి నీళ్లలా ఖర్చయిపోతాయి.

పానీయాలు, ఆహార పదార్థాలు
తాగే డ్రింకులు ఉండకూడదు. దీనివల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. అలాగే తినే ఆహార పదార్థాలు కూడా ఉండకూడదు.
చెత్తాచెదారం
చెత్తాచెదారం, జుట్టు లాంటివి హానికరం. వెంటనే తొలగించాలి. లేదంటే లక్ష్మీదేవిని అగౌరవపరిచినవారిమవుతాం. డబ్బు నష్టాలు వస్తాయి.
చిరిగిపోయిన నోట్లు
వాస్తు ప్రకారం పర్సులో చిరిగిపోయిన నోట్లు అసలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు పర్సును చెక్ చేసుకొని పనికిరానివి ఉంటే తొలగిస్తుండాలి. లేదంటే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత నాణాలు కూడా ఉండకూడదు.
అనవసరమైన బిల్లులు, కాగితాలు
పర్సులో పిచ్చి పిచ్చి కాగితాలు ఉండకూడదు. వాటితో అవసరం ముగియగానే వెంటనే తీసి పారేయాలి. లేదంటే వీటివల్ల కూడా మీరు ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆర్థిక నష్టాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చనిపోయిన వారి ఫోటోలు
మరణించినవారి ఫొటోలు పర్సులో ఉండకూడదు. లేదంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి ఫొటోలు ఉంటే వెంటనే తొలగించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications