వాస్తు ప్రకారం ఇంట్లో పైకప్పు మీద ఈ వస్తువులు ఉండకూడదు..!
అందరూ సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలనే కోరుకుంటారు. అయితే మనం అనుకున్నట్లుగా జీవితం ఉండదు. కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు అనేవి కాలచక్రంలా తిరుగుతుంటాయి. వీటన్నింటికీ అతీతంగా ఉండటం మనిషి అలవాటు చేసుకోవాలి. భౌతిక సుఖాల లాలసలో పడిపోయి అవే జీవితమనుకుంటాడు. అనుకున్న కోరికలను నెరవేర్చుకోవడానికి జ్యోతిష్యాన్ని, తర్వాత ఇబ్బందులుంటే సరిచేసుకొని సంపదను పొందడానికి వాస్తును ఆశ్రయిస్తుంటాడు.
వాస్తు ప్రకారం మన దగ్గరకు, మన ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే కొన్ని వస్తువులను ఇంటి నుంచి బయట పడేయాలి. అలాగే ఇంట్లో ఉండే పైకప్పుపై కొన్ని వస్తువులను నిల్వ ఉంచకూడదు. ఒకవేళ ఉంచాలనుకుంటే వాస్తు నియామాలను కచ్చితంగా పాటించాలి. ఇలా చేయడంవల్ల సానుకూల శక్తి కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి సంతోషించి సంపదను పెంచుతుంది.

పైకప్పులోనే కాకుండా ఇంట్లో కూడా ఓ మూలన పాత వస్తువులను పడేస్తారు.
ఈ అలవాటును కచ్చితంగా మానుకోవాలి.
దీనివల్ల మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు.
ఇంట్లో వ్యతిరేక శక్తి ప్రబలుతుంది.
ఇంటి పై కప్పును శుభ్రంగా ఉంచుకోవాలి.
కుండీలు పెట్ట చెట్లు పెంచుకోవచ్చు
మొక్కలు నాటొచ్చు.
సానుకూల శక్తిని పెంచుతుంది.
పగిలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటి పైకప్పులో ఒక మూలలో నిల్వ చేస్తారు.
అలా చేస్తే పేదరికం వస్తుంది.
శనిదేవుడు ఆగ్రహిస్తాడు.
తుప్పు పట్టిన వస్తువులు, ఇనుము, విరిగిపోయి గడియారాలు పైన పెట్టకూడదు.
దీనివల్ల వాస్తు దోషాలు తలెత్తుతాయి.












Click it and Unblock the Notifications