వాస్తు ప్రకారం సింహద్వారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే!
ఇంట్లోని ఇతర ద్వారాలన్నిటి కంటే ప్రధాన ద్వారానికి అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉంటుంది. సింహ ద్వారం మీదే అందులో నివసించే కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సింహ ద్వారం ఏ దిశలో ఉన్నా ఆ ద్వారం ఏ విధంగా ఉండాలి, దాని ముందు ఏముండాలి అన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పురాతన వాస్తు ప్రామాణిక గ్రంథం 'విశ్వకర్మ' తెలియజేసింది. ఎందుకంటే ఇంటి యజమాని పురోగతికి, సమాజంలో హోదాకు, ఆరోగ్యానికి, సంపదకు ప్రధాన ద్వారం కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడానికి కారణం.. కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం.
ప్రధాన ద్వారం తీసేటప్పుడు, వేసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకూడదు.
అలా చేస్తే ఇంట్లోవారి ఆకలి తీరదు.
సింహద్వారం నుంచి కిర్రు మంటూ చప్పుడు రాకూడదు.

తలుపునకు సంబంధించి చెక్కలో వంపులు ఉండకూడదు.
సొట్టలు అసలే ఉండకూడదు.
ఇలా ఉంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
కింద ఎలా అయితే ప్రధాన తలుపు నిర్మించారో, పై అంతస్తులో కూడా అలాగే ఉండాలి.
ఇవి రెండు రకాలుగా ఉంటే ఇంటి యజమానికి నష్టం.
ప్రధాన ద్వారం తెరవగానే నాలుగరోడ్ల కూడలి కనిపించకూడదు.
ఇలా ఉంటే ఆ ఇంటికి యజమాని ఎప్పుడూ దూర ప్రాంతంలోనే ఉంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఉండరు. ప్రవాసంలోనే ఉంటారు.
పనిమనుషులు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తారు.
ప్రధాన తలుపునకు ఎదురుగా బురద గుంతలు ఉండకూడదు.
అలా ఉంటే సుఖసంతోషాలుండవు.
కుటుంబంలో అనారోగ్యాలు కలుగుతాయి.
సింహద్వారానికి ఎదురుగా జెండాలు కట్టి కనపడకూడదు.
చెట్లకు జెండాలు కట్టడంవల్ల హారతి కర్పూరంలా ఆస్తి కరిగిపోతుంది.
అనారోగ్యాలు కలుగుతాయి.
ప్రధాన తలుపునకు ఎదురుగా చెట్టు ఉంటే సంతానం కలగదు.
సింహద్వారం తెరవగానే బూడిద కనపడకూడదు.
ఇలా కనపడితే ఆ కుటుంబ సభ్యులకు వృద్ధి ఉండదు.
నష్టాలు చుట్టుముడతాయి.
ప్రధాన తలుపుపై చెట్టు నీడ పడకూడదు.
ధన నష్టాలు కలుగుతాయి.
ఇంటిముందు తులసి మొక్క పెంచాలి.
దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
అందుకే వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications