వాస్తు ప్రకారం ఇంటిముందు, తలుపు దగ్గర ఇవి ఉండకూడదు.. ఒకసారి చూడండి
వాస్తు ప్రకారం ఇంట్లో దిశ చక్కగా ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంట్లో అపరిశుభ్రమై వాతావరణం, ఇంటి ముందు చెత్త ఉండం, తలుపు దగ్గర చెత్తను ఉంచడంలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఆ కుటుంబంలో నివసించదు. అంతేకాకుండా రోగాలు రావడంతోపాటు ధన నష్టం కలుగుతుంది. అశాంతి నెలకుంటుంది. అందుకే వాస్తు నియమాలు కచ్చితంగా పాటించడంతోపాటు కొన్ని కొన్ని వస్తువులను కూడా వదిలించుకోవాలని నిపుణులతోపాటు మన పెద్దలు కూడా చెబుతుంటారు. ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన తలుపు రోడ్డు కంటే ఎత్తుండాలి.
తలుపుకు ఎదురుగా ముళ్ల చెట్లు నాటొద్దు.
ముళ్ల మొక్కలు ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఉండదు.

కొంతమంది ఇట్లో ఇటుకలను, రాళ్లను ఉంచుకుంటారు.
వాస్తు ప్రకారం ఇంటి బయట రాళ్లు జీవితంలో ఎదుగుదలను అడ్డుకుంటాయి.
ఇంట్లో రాళ్లుంటే బయట పడేయండి.
ఇంట్లో మురికి నీరు పేరుకుపోతే లక్ష్మీదేవి నివాసం ఉండదు.
ఇంటి బయట మురుగు లేకుండా చూసుకోవాలి.
ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
అందుకే ఇంట్లోను, బయట మురుగు లేకుండా చూసుకోవాలి.
వాస్తు ప్రకారం ఇంటి ముందు విద్యుత్తు స్తంభం ఉండకూడదు.
స్తంభం ఉంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి.
గొడవలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
వాస్తు బాగుంటేనే స్థానబలం పెరుగుతుంది.
ఇంట్లోకి ప్రవేశించే మార్గం కూడ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
అందుకే ప్రధాన ద్వారం తూర్పు, లేదంటే ఉత్తరం ఉంటే చాలా మంచిది.












Click it and Unblock the Notifications