అధిక శ్రావణ మాసంలో దేశానికి సంపద నష్టం; జరిగే కీలక పరిణామాలివే!!

ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం జులై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణమాసం ఉంటుంది. ఇక ఈ అధిక మాసాన్ని శూన్యమాసం అని అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో అధిక శ్రావణమాసం ఉంటే నష్టాలు తప్పవు.

ఈ అధికశ్రావణం అసాధారణ వర్షపాతం కారణంగా వ్యవసాయ నష్టాన్ని కలిగిస్తుంది. శూన్యమాసంగా చెప్పబడే ఈ అధికమాసం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, కొన్ని ప్రాంతాలలో అనావృష్టితో సంపదనష్టం జరుగుతుంది. ఇప్పటికే భారతదేశంలోని ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలలో వరదల పరిస్థితి ఉంటే బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. కరువుతో బీహార్ రాష్ట్రం ఇబ్బందిపడుతున్న పరిస్థితి ఉంది.

adhik sravana maas: loss of wealth to the country; The key developments that happens!!

అంతేకాదు ఉదయం 5.10 నిమిషాలకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఖఫర్ యోగం ఏర్పడుతుంది. అమావాస్యనాడు సూర్యుని రాశి మారడం వల్ల శని, కుజుడు ప్రమాదకరమైన సంయోగం ఏర్పడి ఖఫర్ యోగ ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల దేశంలో అనేక సంక్షోభాలు, ప్రభుత్వ సవాళ్లు పెరుగుతాయి. కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. ఇది అంగారక మరియు శుక్ర గ్రహాల నుండి ప్రభావాలను పొందుతుంది.

దీంతో రాబోయే నెలలో సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పెను సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది. శని పై అంగారకుడికి అంశం ద్రవ్యోల్బణం పెరుగుదలను కూడా సూచిస్తుంది. ఈ యోగం వల్ల ఎక్కువ పిడుగు పాట్లు, భూకంపాలు, హిమాలయాల ప్రాంతంలో భూకంపాలు సంభవించే అవకాశం, ఉత్తర భారత దేశంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది.

ఖఫర్ యోగం వల్ల తొమ్మిదవ ఇంట్లో శని స్థానం ఉండడం వల్ల పార్లమెంట్లో ఒక ప్రధాన చట్టంపై ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశాన్ని సూచిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజకీయ గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. అయినప్పటికీ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంపై బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టవచ్చు.

ఇక అధికమాసం ప్రభావంతో రాబోయే 30 రోజుల్లో శని మరియు అంగారక గ్రహాల కలయిక వల్ల కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లు కొనసాగుతాయి. మణిపూర్లో హింస మరియు ద్రవ్యోల్బణం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మధ్య భారత దేశంలో భారీ వర్షాలు వస్తాయి. దక్షిణ ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడంతో పాటు, వాతావరణ పరిస్థితులు తూర్పు భారతదేశంలో వరి పంటలపై ప్రభావాన్ని చూపిస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+