30సంవత్సరాల తర్వాత 2025లో వీరికి అఖండ ధనయోగం ప్రకటించిన శని, బుధులు!
2025 సంవత్సరం ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారనున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం అనేక సంచలనాలను నమోదు చేయబోతుంది. ఈ సంవత్సరం అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. అంతేకాదు వివిధ గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని కూడా చూపిస్తున్నాయి..
కుంభరాశిలో శని, బుధుల కలయిక
2025 సంవత్సరంలో రెండు స్నేహపూర్వకమైన గ్రహాల కలయిక జరగబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. కుంభరాశిలో శనీశ్వరుడు, బుధుడు సంయోగం చెందబోతున్నారు. కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఖగోళ పరివర్తన కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
2025 సంవత్సరంలో మేష రాశి జాతకులకు బుధ, శని గ్రహాలు కలయిక కారణంగా కొన్ని సానుకూల ఫలితాలు కలగబోతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయానికి ఇబ్బంది ఉండదు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో చాలా బాగుంటుంది. ఇక 2025 సంవత్సరం ప్రధమార్ధంలో వీరు ఏ పని చేపట్టిన విజయాలను సాధిస్తారు. అలాగే వీరికి అదృష్టం కూడా అన్ని విధాల కలిసొస్తుంది.
మకర రాశి
2025లో బుధ శని గ్రహాల కలయిక మకర రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు పురోగతిలో ప్రయాణిస్తారు. సమాజంలో గొప్ప వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి పురోగతికి కారణమవుతారు. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.
కుంభరాశి
బుధ శని గ్రహాల కలయిక కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలోనే ఈ రెండు గ్రహాలు కలుస్తున్న కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. 2025లో వీరికి భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. సమాజంలో గుర్తింపుతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. బుధ, శని గ్రహాల కలయిక ఈ రాశి వారికి విపరీతమైన విజయాలను అందిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications