52ఏళ్ళ తర్వాత వీరికి ధనపురాశులను రథంపై తెస్తున్న భానుసప్తమి!
జ్యోతిష్య శాస్త్రంలో ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రస్తుతం ధనుర్మాసంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితం అవుతుంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశి లోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
భాను సప్తమి నాడు అరుదైన యోగం
ప్రస్తుతం ధనుర్మాసం కొనసాగుతుంది. పవిత్రమైన ధనుర్మాసంలో అరుదైన భాను సప్తమి అద్భుతమైన యోగాలను ఇస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే భాను సప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నేడు డిసెంబర్ 22వ తేదీన భాను సప్తమి రోజు అరుదైన యోగం ఏర్పడుతుంది.

52 సంవత్సరాల తర్వాత భాను సప్తమి
52 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం కొన్ని రాశుల వారికి అదృష్టం తెచ్చిపెడుతుంది. సూర్యుడు, శని దేవుడు ఒకే సరళరేఖ మీదకు రానున్న క్రమంలో ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో తమ ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఇది ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి కుబేర యోగాన్ని కటాక్షిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి
భాను సప్తమి రోజు ఏర్పడే అరుదైన యోగం కారణంగా మేషరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఈ సమయంలో మేష రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయాలలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు శుభాలను చేకూరుస్తాయి.
సింహరాశి
భాను సప్తమి రోజు ఏర్పడే అరుదైన యోగం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. సొంతింటి కల సాకారం అవుతుంది. సింహరాశి జాతకులు విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఇది సింహ రాశి వారికి అన్నింటా అదృష్ట సమయం.
కన్యారాశి
భాను సప్తమి రోజు ఏర్పడే అరుదైన యోగం కారణంగా కన్యారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారు కోర్టు కేసులో విజయం సాధిస్తారు. భార్య తరపున ఆస్తులు సొంతమవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లే వారికి ఇది అనుకూల సమయం. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications